మార్చ్ 3 నుంచి మహీంద్రా ఎమ్-ప్లస్ మెగా సర్వీస్ క్యాంప్
ప్రముఖ దేశీయ అగ్రగామి యుటిలిటీ వాహనాల తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ (ఎమ్ అండ్ ఎమ్) తమ వినియోగదారుల కోసం 'ఎమ్ ప్లస్' (M-Plus) పేరిట దేశంలో ఉచిత మెగా సర్వీస్ క్యాంప్‌ను నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.
మహీంద్రా అందిస్తున్న స్కార్పియో, బెలెరో, జైలో, క్వాంటో, ఎక్స్‌యూవీ500, రెక్స్టన్, థార్, వెరిటో, వైబ్, లోగాన్ వాహనాలను వినియోగిస్తున్న కస్టమర్ల కోసం ఈ సర్వీస్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ ఎమ్-ప్లస్ సర్వీస్ క్యాంప్ మార్చి 3, 2014వ తేదీ నుండి ప్రారంభమైన మార్చ్ 9, 2014వ తేదీ వరకూ సాగుతుంది.

దేశవ్యాప్తంగా ఉన్న అన్ని మహీంద్రా డీలర్‌షిప్‌లు/సర్వీస్ సెంటర్లలో ఈ ఎమ్-ప్లస్ ఉచిత మెగా సర్వీస్ క్యాంప్‌ను నిర్వహించనున్నారు. ఈ ఉచిత సర్వీక్ క్యాంప్‌కు తీసుకువచ్చే మహీంద్రా వాహనాలకు 75 పాయింట్ చెకప్ చేస్తారు. ఇందులో ఇంజన్‌పనితీరు, ఎయిర్ కండీషనింగ్, సస్పెన్షన్, బ్యాటరీ, ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్, వెహికల్ అండ్ర్‌క్యారేజ్ మొదలైన ఇతర అంశాలను తనిఖీ చేసి, మరమ్మత్తులు ఏవైనా అవసరమైతే, ఉచితంగా సరిచేస్తామని కంపెనీ పేర్కొంది.
ఈ ఎమ్-ప్లస్ సర్వీస్ క్యాంప్‌కు వాహనాలను తీసుకువచ్చే మహీంద్రా యజమానులు తమ వాహనాలు పూర్తి కండీషన్‌లో ఉన్నాయన్న భరోసాను పొందగలరని కంపెనీ తెలిపింది. నిపుణులైన టెక్నీషియన్లు అత్యంత ముఖ్యమైన ప్రమాణాలతో సేవలు అందింస్తున్నారని, మహీంద్రా వినియోగదారులకు ఇటువంటి క్యాంప్‌లు ఏటా నిర్వహించి మరిన్ని మెరుగైన సర్వీసింగ్ సెంటర్లలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తామని కంపెనీ వివరించింది.


Click it and Unblock the Notifications








