రూ.5,499 ఈఎమ్ఐకే మహీంద్రా క్వాంటో ఎస్‌యూవీ

By Ravi

ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) దేశీయ విపణిలో విక్రయిస్తున్న కాంపాక్ట్ ఎస్‌యూవీ 'మహీంద్రా క్వాంటో' కోసం కంపెనీ ఇప్పుడు ఓ ఆకర్షనీయమైన ఈఎమ్ఐ ఆఫర్‌ను ప్రకటించింది. కేవలం ఓ చిన్న కారుకు చెల్లించే ఈఎమ్ఐ మొత్తానికే, ఎస్‌యూవీని సొంతం చేసుకోండి అంటూ ఆన్‌లైన్ క్యాంపైన్ నిర్వహిస్తోంది.

కేవలం రూ.5.499 ఈఎమ్ఐ మొత్తానికే మహీంద్రా క్వాంటోని ఇంటికి తీసుకెళ్లండని కంపెనీ తమ ప్రకటనలో పేర్కొంది. అయితే, ఇందుకు సంబంధించి కొన్ని షరతులు విధించింది. ఈ లో ఈఎమ్ఐ ఓ స్టెప్-అప్ స్కీమ్ అని, ఇది సి2 వేరియంట్‌కు మాత్రమే వర్తిస్తుందని, ఇతర వేరియంట్ల విషయంలో ఈఎమ్ఐ మొత్తం మారే అవకాశం ఉంటుందని కంపెనీ వివరించింది.

ఈ ఫైనాన్స్ స్కీమ్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని అధీకృత మహీంద్రా డీలరును సంప్రదించండి.

Mahindra Quanto

మహీంద్రా క్వాంటో విషయానికి వస్తే, ఇది మొత్తం నాలుగు వేరియంట్లలో (సి2, సి4, సి6, సి8) లభిస్తుంది. అన్ని వేరియంట్లు 1.5 లీటర్ త్రీ-సిలిండర్ టర్బో‌ఛార్జ్‌డ్ డీజిల్ ఇంజన్‌తో లభిస్తాయి. ఈ ఇంజన్ గరిష్టంగా 100 బిహెచ్‌పిల శక్తిని, 240 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో జతచేయబడి ఉంటుంది. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం మహీంద్రా క్వాంటో లీటర్ డీజిల్‌కు 17.2 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది.

టాప్-ఎండ్ వేరియంట్ మహీంద్రా క్వాంటోలో డిజిటల్ డ్రైవ్ అసిస్ట్ సిస్టమ్, మైక్రో హైబ్రిడ్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్, ఇంటెలిజెంట్ రివర్స్ అసిస్ట్, సిడి, ఎమ్‌పి3, యూఎస్‌బి, ఆక్స్-ఇన్ సపోర్ట్‌తో కూడిన 2-డిన్ మ్యూజిక్ సిస్టమ్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబిఎస్), ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (ఈబిడి), డ్యూయెల్ ఎయిర్‌బ్యాగ్స్, హై స్పీడ్ వార్నింగ్, ఇంజన్ ఇమ్మొబిలైజర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇది ఫైరీ బ్లాక్, జావా బ్రౌన్, మిస్ట్ సిల్వర్, టోరిడార్ రెడ్, డైమండ్ వైట్, రాకీ బీజ్ అనే ఆరు ఆకర్షనీయమైన రంగుల్లో లభిస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, October 28, 2014, 14:37 [IST]
English summary
India's leading utility vehicle manufacturer Mahindra and Mahindra is offering an attractive EMI scheme on Quanto. Now you can bring home the new Mahindra Quanto SUV for an EMI as low as ₹ 5,499/month. Visit your nearest official Mahindra distributor for more details on this offer.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+