మహీంద్రా రైజ్ ప్రైజ్; 1 మిలియన్ డాలర్లను గెలుచుకోండి!
మహీంద్రా గ్రూప్ భారతదేశంలో కెల్లా అతిపెద్ద వినూత్న ఆవిష్కార బహుమతిని ప్రకటిచింది. 'మహీంద్రా రైజ్ ప్రైజ్' పేరిట కంపెనీ 1 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన బహుమతిని ఆవిష్కరించింది. వినూత్న ఆవిష్కార సంస్కృతికి భారత్‌లో నెలకొల్పడమే దీని లక్ష్యంగా అంతర్జాతీయంగా సంబంధం కలిగిన పరిపూర్ణ పద్దతిలో ఈ బహుమతిని అందిస్తామని కంపెనీ ప్రకటించింది.
ఇందులో ప్రధానంగా రెండు సవాళ్లు ఉంటాయి. అందులో ఒకటి భారతదేశంలో డ్రైవర్ రహిత వాహనాలకు సమాధానమిచ్చే లేదా పరిష్కారం చూపే 'మొబిలిటీ ఛాలెంజ్'. ఇకపోతే రెండవది ప్రజానీకానికి అందుబాలోకి తీసుకువచ్చేలా సౌరశక్తిని లక్ష్యంగా చేసుకుని తయారు చేసే ఉత్పత్తులతో కూడిన 'సోలార్ ఛాలెంజ్'. ఈ రెండు సవాళ్లలో ఉత్తమ పరిష్కారాలు చూపిన వారికి కంపెనీ తగిన ప్రోత్సాహకాలను ఆఫర్ చేస్తుంది.

భారతదేశంలో ఉన్న యువతరంలో సరికొత్తగా ఆలోచించే వారికి మేమే భారీ ప్రోత్సాహ కాలను అందిస్తామని, తదుపరి లక్ష్యంలో మరిన్ని వినూత్న పద్దతులను ఆవిష్క రించేలా కృషి చేస్తున్నామని, రైజ్ ప్రైజ్‌తో జీవితాలను నాటకీయంగా మార్చగలిగే పరిపూర్ణ వినూత్న ఆలోచనలు వచ్చేలా చేయాలన్నది మహీంద్రా గ్రూప్ మదిలో ఉందనని సంస్థ గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తెలిపారు.


Click it and Unblock the Notifications








