మహీంద్రా థార్ అడ్వెంచర్ ఎడిషన్; కేవలం 30 యూనిట్లు మాత్రమే ఉత్పత్తి
భారతదేశపు అగ్రగామి యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) అందిస్తున్న 'థార్' (Thar) ఎస్‌యూవీలో కంపెనీ ఓ కొత్త లిమిటెడ్ ఎడిషన్‌ను విడుదల చేసింది. మహీంద్రా థార్ అడ్వెంచర్ ఎడిషన్ పేరుతో లభ్యం కానున్న ఈ లిమిటెడ్ ఎడిషన్ మోడల్ ఉత్పత్తిని కేవలం 30 యూనిట్లకు మాత్రమే పరిమితం చేశారు.
కొత్త మహీంద్రా థార్ అడ్వెంచర్ ఎడిషన్ జావా బ్రౌన్ కలర్‌లో లభ్యం కానుంది. దీని బాడీపై 2డి మ్యాప్, కంపాస్‌తో కూడిన బాడీ గ్రాఫిక్స్ ఉంటుంది. హెడ్‌లైట్స్, టెయిల్ లైట్లను ప్రొటెక్టర్లతో కవర్ చేశారు. ఆఫ్-రోడింగ్ సమయంలో వాటికి డ్యామేజ్ కలగకుండా ఉండేలా అదనపు ప్రొటెక్షన్‌ను ఆఫర్ చేస్తున్నారు. ఆఫ్-రోడింగ్ కోసం దీని వీల్ ఆర్చెస్ పరిమాణాన్ని కూడా మరించ పెంచారు.

క్యాబిన్ లోపల మార్పుల విషయానికి వస్తే.. కొత్త బ్లాక్ సీట్ కవర్, ఆరెంజ్ బార్డర్స్, సీట్లపై అడ్వెంచర్ ఎడిషన్ బ్రాండింగ్, కొత్త ఫ్లోర్ మ్యాట్స్ వంటివి ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇంజన్ పరంగా కొత్త థార్ అడ్వెంచర్ ఎడిషన్‌లో ఎలాంటి మార్పులు లేవు.
ఇందులో ఉపయోగించిన 2.5 లీటర్, ఫోర్-సిలిండర్, సిఆర్‌డిఈ టర్బో డీజిల్ ఇంజన్ గరిష్టంగా 103 బిహెచ్‌పిల శక్తిని, 247 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. టూ-వీల్ డ్రైవ్ మోడ్‌లో ఇంజన్ నుంచి వచ్చే శక్తి వెనుక చక్రాలకు బదిలీ అవుతుంది.
అయితే, థార్ అడ్వెంచర్ ప్యూర్ ఆఫ్-రోడర్‌గా కనిపిస్తున్న నేపథ్యంలో, కంపెనీ ఇందులో బార్గ్ వార్నర్ ఫోర్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను ఆఫర్ చేస్తే బాగుంటుందనేది మా అభిప్రాయం. థార్ అడ్వెంచర్ ఎడిషన్‌కు సంబంధించిన ధర, లభ్యత వంటి వివరాలను కంపెనీ ఇంకా వెల్లడి చేయలేదు.


Click it and Unblock the Notifications








