మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి 7-8 కొత్త వేరియంట్లు

By Ravi

గడచిన సంవత్సరంలో భారత ఆటోమొబైల్ మార్కెట్ మందగమనం కారణంగా, దాదాపు అన్ని కంపెనీలు నిరుత్సాకర ఫలితాలనే కళ్లజూసాయి. అయితే, ఇదే సమయంలో తక్కువ ధర కలిగిన చిన్న కార్లు మరియు అత్యధిక ధర కలిగిన విలాసవంతమైన కార్లు మాత్రం ప్రోత్సాకర వృద్ధిని కనబరచాయి. ఉదాహరణకు, 2013లో ఆడి ఇండియా 10,000 లకు పైగా కార్లను విక్రయిస్తే, మెర్సిడెస్ బెంజ్ ఇండియా 9,000 లకు పైగా కార్లను విక్రయించింది.

ఇదే సమయంలో మధ్యశ్రేణి కార్ల (రూ.8 లక్షల నుంచి రూ.20 లక్షల విలువ కలిగిన కార్ల)ను విక్రయించే కంపెనీలు మాత్రం ఆశించిన ఫలితాలను పొందలేకపోయాయి. అలాంటి వాటిల్లో మహీంద్రా అండ్ మహీంద్రా అండ్ మహీంద్రా కూడా ఒకటిగా చెప్పుకోవచ్చు. మహీంద్రాకు సెడాన్ లేదా హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో సరైన ఉత్పత్తులు లేవు. ఎంట్రీ లెవల్ వాహన విభాగంలో, ప్రస్తుతం కంపెనీ కేవలం వెరిటో వైబ్, వెరిటో సెడాన్లను మాత్రమే విక్రయిస్తోంది.

గతంలో రెనో-మహీంద్రా భాగస్వామ్యంలో భాగమైన రెనో లోగాన్ కారుకు రీషేప్డ్ వెర్షనే ఈ మహీంద్రా వెరిటో. మొదట్లో ఈ మోడల్ అమ్మకాలు జోరుగానే సాగినప్పటికీ, ఆ తర్వాత ఇవి క్రమంగా క్షీణించాయి. అలాగే, ఇదే ప్లాట్‌ను ఆధారంగా చేసుకొని, తక్కువ ధరకే అందించాలనే ఉద్దేశ్యంతో 2013లో మహీంద్రా వెరిటో వైబ్ నాచ్‌బ్యాక్ (హ్యాచ్‌బ్యాక్, సెడాన్ల కలయికతో తయారు చేసిన మోడల్) కూడా కంపెనీ ఆశించిన ఫలితాలు తెచ్చిపెట్టడంలో విఫలమైంది.

Mahindra Verito Vibe

ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో, మహీంద్రా వీటన్నింటినీ అధిగమించేందుకు పట్టు వదలని విక్రమార్కుడిలా, ఈ సంవత్సరంలో మరో 7 నుంచి 8 కొత్త వేరియంట్లను మార్కెట్లోకి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతం కంపెనీ అందిస్తున్న ఉత్పత్తులలోనే ఈ కొత్త వేరియంట్లను ప్రవేశపెట్టనున్నారు. ఈ విషయాన్ని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ డివిదన్ ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ప్రవీణ్ షా వెల్లడించారు. 2014లో ఆటోమొబైల్ పరిశ్రమ మెరుగుపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

అయితే, ఈ కొత్త వేరియంట్లు ఎంటనే విషయాన్ని మాత్రం ఆయన దాటవేశారు. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, వెరిటో, వెరిటో వైబ్, స్కార్పియో మరియు క్వాంటో మోడళ్లలో మాత్రం అప్‌గ్రేడెడ్ వేరియంట్లు ఈ ఏడాదిలో విడుదల కావచ్చని తెలుస్తోంది. తాజా అప్‌డేట్స్ కోతం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Thursday, January 9, 2014, 15:55 [IST]
English summary
Mahindra plans to expand its product portfolio in 2014 with the introduction of 7-8 new variants."We will introduce 7-8 variants in our portfolio," Mahindra & Mahindra Automotive Division Chief Executive Pravin Shah said while speaking to reporters. 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+