ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో రానున్న సరికొత్త మహీంద్రా స్కార్పియో

By Ravi

భారతదేశపు అగ్రగామి యుటిలిటీ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) సెప్టెంబర్ నెలాఖరులో విడుదల చేసిన సరికొత్త స్కార్పియో ఫేస్‌లిఫ్ట్‌లో మరో కొత్త వేరియంట్‌ను పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాటారం.

కొత్త 2014 మహీంద్రా స్కార్పియో ఇప్పటి వరకూ కేవలం మ్యాన్యువల్ గేర్‌బాక్స్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తోంది. ఈ నేపథ్యంలో, ఇందులో ఓ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కలిగిన కొత్త వేరియంట్‌ను కూడా పరిచయం చేయాలని కంపెనీ భావిస్తోంది. ఇప్పటికే ఆటోమేటిక్ వెర్షన్ స్కార్పియోను మహీంద్రా భారత రోడ్లపై టెస్టింగ్ చేస్తోంది. ఈ ఏడాది చివర్లో కానీ లేదా వచ్చే ఏడాది ఆరంభంలో కానీ స్కార్పియో ఆటోమేటిక్ విడుదల కావచ్చని తెలుస్తోంది. ఇది టాప్-ఎండ్ వేరియంట్ (ఎస్10)లో మాత్రమే లభ్యం కావచ్చని అంచనా.


మహీంద్రా స్కార్పియో ఆటోమేటిక్ వెర్షన్‌లో 2.2 లీటర్, 4-సిలిండర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించే అవకాశం ఉంది. ఈ ఇంజన్ గరిష్టంగా 120 బిహెచ్‌పిల శక్తిని, 280 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇకపోతే, ఇందులో ఉపయోగించబోయే ఆటోమేటిక్ గేర్‌బాక్స్ విషయానికి వస్తే.. మునుపటి తరం స్కార్పియోలో బాష్ నుంచి గ్రహించిన 6-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్సునే ఈ కొత్త తరం స్కార్పియోలో కూడా కొనసాగించవచ్చని సమాచారం. ఈ ఆటోమేటిక్ వెర్షన్ స్కార్పియో ధర రూ.12 లక్షలకు పైగానే ఉండొచ్చని అంచనా.

ఇక కొత్త 2014 మహీంద్రా స్కార్పియో విషయానికి వస్తే.. దీనిని సరికొత్త ఛాస్సిస్‌పై తయారు చేశారు. హైడ్రోఫార్మింగ్ పద్ధతిని ఉపయోగించి ఈ ఛాస్సిస్‌ను తయారు చేశారు, ఫలితంగా ఇది మునుపటి వెర్షన్ ఛాస్సిస్ కన్నా ధృడంగా ఉంటుంది. ఈ కొత్త 2014 మహీంద్రా స్కార్పియో ఎస్2, ఎస్4, ఎస్6, ఎస్6+, ఎస్8 మరియు ఎస్10 అనే ఆరు వేరియంట్లలో లభ్యమవుతుంది.


ఇంజన్ విషయానికి వస్తే.. ఇది రెండు విభిన్న ఇంజన్ ఆప్షన్లలో లభిస్తుంది. అందులో ఒకటి 2.2 లీటర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్, మరొకటి 2.5 లీటర్ ఎమ్ఐ2డిఐసిఆర్ డీజిల్ ఇంజన్. ఇందులోని 2.2 లీటర్, 4-సిలిండర్ ఎమ్‌హాక్ డీజిల్ ఇంజన్ 4000 ఆర్‌పిఎమ్ వద్ద 120 బిహెచ్‌పిల శక్తిని, 1800-2800 ఆర్‌పిఎమ్ వద్ద 280 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ ఎస్4, ఎస్6, ఎస్6 ప్లస్, ఎస్8 మరియు ఎస్10 వేరియంట్లలో లభిస్తుంది.

ఇకపోతే బేస్ వేరియంట్ (ఎస్2) మహీంద్రా స్కార్పియోలో 2.5 లీటర్, 4-సిలిండర్, టర్బోచార్జ్డ్ సిఆర్‌డిఐ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఇది గరిష్టంగా 3200 ఆర్‌పిఎమ్ వద్ద 75 బిహెచ్‌పిల శక్తిని, 1400-2200 ఆర్‌పిఎమ్ వద్ద 280 ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ కేవలం ఎస్2 వేరియంట్లో మాత్రమే లభిస్తుంది. ఈ ఇంజన్లు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో లభిస్తాయి. కంపెనీ ఈ గేర్‌బాక్స్ పనితీరును మరింత మెరుగు పరిచింది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, కొత్త స్కార్పియో లీటరు డీజిల్‌కు 15 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది.

2014 Mahindra Scorpio

More from DriveSpark

Article Published On: Friday, November 7, 2014, 11:06 [IST]
English summary
Mahindra is planning introduce automatic gearbox in its newly launched Scorpio SUV. Mahindra is already started testing the new Scorpio AT on India roads.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+