వీడియో: మేకింగ్ ఆఫ్ మహీంద్రా ఎక్స్‌యూవీ500
ఎస్‌యూవీ స్పెషలిస్ట్ మహీంద్రా అండ్ మహీంద్రా (ఎమ్ అండ్ ఎమ్) ప్రవేశపెట్టిన గ్లోబల్ స్టాండర్డ్ ఎస్‌యూవీ 'ఎక్స్‌యూవీ500' అనతి కాలంలోనే దేశీయ కస్టమర్లకు అతి చేరువైంది. కంపెనీ అందిస్తున్న సక్సెస్‌ఫుల్ బడ్జెట్ ఎస్‌యూవీలు బొలెరో, స్కార్పియో మోడళ్లను సైతం ఓవర్‌టేక్ చేసిన ఈ ప్రీమియం ఎస్‌యూవీ, తన మోడ్రన్ డిజైన్ మరియు స్టన్నింగ్ ఫీచర్లతో కస్టమర్లను ఆకర్షిస్తోంది.
చిరుతపులి నుంచి స్ఫూర్తి పొంది ఈ తయారు చేశామని చెప్పిన మహీంద్రాకు, ఇది నిజంగా చీతా లాంటి పేరు ప్రతిష్టలను తెచ్చిపెట్టింది. ఈ మోడల్ మార్కెట్లోకి విడుదలైన రెండేళ్ల వ్యవధిలోనే 75,000 మందికి పైగా వినియోగదారులకు ఇది చేరువ అయింది. మహీంద్రా తొలిసారిగా సెప్టెంబర్ 2011లో ఈ మోడల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది.

మహీంద్రా ఎక్స్‌యూవీ500 ఎస్‌యూవీని కంపెనీ పూర్తిగా చెన్నైలోని ఆర్ అండ్ డి కేంద్రంలో డిజైన్ చేసింది. ప్రపంచ స్థాయి డిజైన్, అధునాతన టెక్నాలజీ, సౌకర్యవంతమైన మరియు సురక్షితమైన ఫీచర్లతో రూపుదిద్దుకున్న ఈ ఎస్‌యూవీ, ఆరంభం నుంచే అభిమానులను ఆకట్టుకుంటోంది. వాస్తవానికి, మహీంద్రా నుంచి ఇంత స్టయిలిష్ స్పోర్టీ ఎస్‌యూవీ గతంలో ఎన్నడూ రాలేదు.
ఈ ఎస్‌యూవీలో పవర్‌ఫుల్ 2.2 లీటర్ ఎమ్‌హాక్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 140 బిహెచ్‌పిల శక్తిని, 330 ఎన్‌ఎమ్‌ల టార్క్‌ను విడుదల చేస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్ (గేర్‌బాక్స్) సిస్టమ్‌తో లభిస్తుంది. ఇది కేవలం 5.4 సెకండ్లలోనే 0-60 కి.మీ. వేగాన్ని అందుకుంటుంది.
సరే, ఇదంతా అటుంచితే, ప్రముఖ టెలివిజన్ ఛానెల్ డిస్కవర్ తమ ఇన్‌సైడ్ అవుట్ ప్రోగ్రామ్‌లో 'మేకింగ్ ఆఫ్ మహీంద్రా ఎక్స్‌యూవీ500' (ఎక్స్‌యూవీ500 తయారీ)ని టెలికాస్ట్ చేసింది. ఒకవేళ మీరు ఆ కార్యక్రమాన్ని చూడటం మిస్ చేసి ఉన్నట్లయితే, క్రింది వీడియోలీ మహీంద్రా విడుల చేసిన షార్ట్ ఎడిట్ వెర్షన్‌ను వీక్షించండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/KESI7CHY1G4?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








