25 లక్షల ఉత్పత్తి మార్కును దాటిన మారుతి కె-సిరీస్ ఇంజన్స్
భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న కార్లలో పెట్రోల్ వెర్షన్ కార్లే అధికంగా ఉన్న సంగతి మనందరికీ తెలిసినదే. ఈ పెట్రోల్ వెర్షన్ కార్లలో కంపెనీ పరిచయం చేసిన అధునాతన కె-సిరీస్ ఇంజన్లను అతి తక్కువ సమయంలోనే అత్యం పాపులారిటీని దక్కించుకున్నాయి.
మారుతి సుజుకి ఇండియా ఇప్పటి వరకు 25 లక్షల కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్లను ఉత్పత్తి చేసింది. ప్రస్తుతం మారుతి విక్రయిస్తున్న ఆల్టో కె10, వ్యాగన్ఆర్, సెలెరియో, స్విఫ్ట్, డిజైర్ మొదలైన మోడళ్లలో ఈ కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్లను ఉపయోగిస్తున్నారు.
మారుతి సుజుకి తొలిసారిగా తమ కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌ను 2008లో ఏ-స్టార్ కారులో పరిచయం చేసింది. ఆ తర్వాత అనేక మోడళ్లలో (ఎర్టిగా ఎమ్‌పివిలో కూడా) ఈ పెట్రోల్ వెర్షన్ కె-సిరీస్ ఇంజన్లను ఉపయోగించడం ప్రారంభించారు.

తమ కొత్త మోడళ్లలో ఇంజన్ రీఫైన్‌మెంట్ అనేది ఓ నిరంతరాయ ప్రక్రియ అని, ఎప్పటికప్పుడు మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకొని తమ కార్లలోని ఇంజన్లను మరింత అధిక మైలేజీని, సుపీరియర్ పెర్ఫార్మెన్స్‌ను ఇచ్చేలా మరియు తక్కువ కర్భన ఉద్ఘారాలను విడుదల చేసేలా అభివృద్ధి చేస్తుంటామని మారుతి సుజుకి ఇంజనీరింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి.వి. రామన్ తెలిపారు.
మరికొద్ది రోజుల్లో మారుతి సుజుకి విడుదల చేయనున్న సియాజ్ సెడాన్‌లో కూడా కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. మారుతి సుజుకి ఎర్టిగాలో ఉపయోగిస్తున్న 1.4 లీటర్ కె-సిరీస్ ఇంజన్‌నే ఈ కొత్త సుజుకి సియాజ్ సెడాన్‌లో ఉపయోగించవచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








