స్విఫ్ట్ అన్ని భారతీయ ప్రమాణాలను పాటిస్తుంది: మారుతి అధికారి

By Ravi

భారతదేశపు అగ్రగామి ఆటోమొబైల్ సంస్థ మారుతి సుజుకి ఇండియా నుంచి అత్యధికంగా అమ్ముడుపోతున్న స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్, గ్లోబల్ న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (గ్లోబల్ ఎన్‌సిఏపి) నిర్వహించిన క్రాష్ టెస్టులో జీరో రేటింగ్‌ను దక్కించుకున్న విషయం తెలిసినదే. ఈ రిపోర్ట్స్ వెలుగులోకి వచ్చిన రెండు మూడు రోజుల తర్వాత, ఈ విషయంపై కంపెనీ ఉన్నాతాధికారి ఒకరు స్పందించారు.

భారత ప్రభుత్వం మరియు దేశంలోని నియంత్రణ సంస్థలు నిర్దేశించిన భద్రతా ప్రమాణాలను తమ అన్ని కార్లు పాటిస్తాయని, కానీ ఇప్పుడు విదేశాల్లో అనుసరిస్తున్న అత్యున్నత భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా ఈ కార్లను టెస్ట్ చేస్తే, అవి అందులో పాస్ కాకపోవచ్చని మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ (మార్కెటింగ్) మనోహర్ భట్ తెలిపారు.


దీన్ని బట్టి చూస్తుంటే, దేశీయ ఆటోమొబైల్ కంపెనీలు తయారు చేసే కార్లు భారత సర్కారు నిర్దేశించిన భద్రతా ప్రమాణాలు పాటించినప్పటికీ, విదేశాల్లో అమల్లో ఉన్న భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా మన కార్లను (మేడ్ ఇన్ ఇండియా కార్లను) టెస్ట్ చేస్తే, అవి ఖచ్ఛితంగా విఫలమౌతాయన్నమాట. అంటే.. విదేశాల్లోని వాహన ప్రయాణీకులకు ఉండే రక్షణ ఇండియాలోని వాహన ప్రయాణీకులకు ఉండదన్నదే కదా దీని అర్థం.

గ్లోబల్ ఎన్‌సిఏపి క్రాష్ టెస్టులో కారు సర్టిఫై అవ్వాలంటే, సదరు కారులో కనీసం ఎయిర్‌బ్యాగ్స్, ఏబిఎస్ ఫీచర్లయినా ఉండాలి. భారత మార్కెట్లో అమ్ముడుపోతున్న స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో ఎయిర్‌బ్యాగ్స్ లేదా ఏబిఎస్ రెండూ కూడా అన్ని వేరియంట్లలో స్టాండర్డ్‌గా లభ్యం కావు. టాప్-ఎండ్ వేరియంట్లో మాత్రమే ఇవి ఆప్షనల్‌గా అందుబాటులో ఉంటాయి. తాజాగా టెస్ట్ ఎన్‌‌సిఏపి చేసిన స్విఫ్ట్ కారులో కూడా ఈ రెండు సేఫ్టీ ఫీచర్లు లేవు.

Maruti Swift Facelift

ఈ కారుకు గంటకు 65 కిలోమీటర్ల వేగం వద్ద క్రాష్ టెస్ట్ నిర్వహించినప్పుడు, కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఫలితంగా మారుతి స్విఫ్ట్ ఈ క్రాష్ట్ టెస్ట్‌లో జీరో సేఫ్టీ రేటింగ్ పొందింది. ఇలాంటి కారులో ప్రయాణించడం ప్రయాణీకులకు ఏమాత్రం సురక్షితం కాదని గ్లోబల్ ఎన్‌సిఏపి సర్టిఫై చేసింది. అయితే, లాటిన్ అమెరికాకు ఎగుమతి అవుతున్న స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్‌లో మాత్రం ఏబిఎస్, ఎయిర్‌బ్యాగ్స్ ఫీచర్లను స్టాండర్డ్‌గా ఆఫర్ చేస్తున్నారు. ఈ టెస్ట్‌లో లాటిన్ అమెరికా వెర్షన్ స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ ఐదు స్టార్లకు మొత్తం మూడు స్టార్ల రేటింగ్‌ను దక్కించుకుంది.

అంటే, ఇండియన్ వెర్షన్ స్విఫ్ట్ కన్నా లాటిన్ అమెరికా వెర్షన్ స్విఫ్ట్ సేఫ్టీ పరంగా ఎన్నో రెట్లు మెరుగైనదన్నమాట. ఈ క్రాష్ టెస్టులో డ్రైవర్ స్థానంలో ఉంచి డమ్మీపై తీవ్రమైన గాయాలు నమోదయ్యాయి. ఇదిలా ఉండగా.. మనదేశంలో కూడా వాహనాలు ప్రపంచ స్థాయి భద్రతా ప్రమాణాలను పాటించేందుకు వీలుగా ఉండేలా, 2016 నాటికి ఇండియన్ ఎన్‌సిఏపిని ఏర్పాటు చేయాలని సర్కారు యోచిస్తోంది. ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, భారతదేశంలో తయారైన ప్రతి కారు కూడా ఈ టెస్ట్‌లో పాస్ కావల్సిన అవసరం ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, November 5, 2014, 13:45 [IST]
English summary
In Respons to the Global NCAP results, that the Maruti Swift failed a frontal crash test, Maruti Suzuki India Limited’s VP Marketing Manohar Bhat denied the results and stated that.. all Maruti cars meet the highest safety standards set by the Indian government and regulatory bodies in the country.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+