మారుతి ఆల్టో 800 లిమిటెడ్ ఎడిషన్ విడుదల
మారుతి సుజుకి అందిస్తున్న ఎంట్రీ లెవల్ స్మాల్ కార్ ఆల్టో 800లో కంపెనీ ఓ లిమిటెడ్ ఎడిషన్‌ను మార్కెట్లో విడుదల చేసింది. మారుతి సుజుకి ఆల్టో 800 మాగ్జిమ్ పేరుతో లభ్యం కానున్న ఈ లిమిటెడ్ ఎడిషన్ రెగ్యులర్ వేరియంట్‌తో పోల్చుకుంటే మరిన్ని అదనపు ఫీచర్లతో లభ్యం కానుంది.
మారుతి సుజుకి ఆల్టో 800 మాగ్జిమ్ లిమిటెడ్ ఎడిషన్‌లో ఆర్ట్ లెథర్ సీట్ కవర్స్, ఆడియో సిస్టమ్, సైడ్ మోల్డింగ్స్, కీలెస్ ఎంట్రీ, రియర్ రూఫ్ స్పాయిలర్, ఆకర్షనీయమైన బాడీ గ్రాఫిక్స్ వంటి అదనపు ఫీచర్లు లభిస్తాయి. ఈ లిమిటెడ్ ఎడిషన్ కొనుగోలుపై కస్టమర్లు రూ.66,666 వరకు బెనిఫిట్లను పొందవచ్చు.
ఈ లిమిటెడ్ ఎడిషన్ ఆల్టో 800 కారులో ఇంజన్ పరంగా ఎలాంటి మార్పులు లేవు. ఈ ఆఫర్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని అధీకృత మారుతి డీలర్‌షిప్‌ను సందర్శించండి.

మారుతి సుజుకి ఆల్టో 800 పెట్రోల్, సిఎన్‌జి ఫ్యూయెల్ ఆప్షన్లతో లభిస్తుంది. ఇందులో ఉపయోగించిన రీడిజైన్డ్ ఎఫ్8డి 796సీసీ, 3-సిలిండర్, 12-వాల్వ్ పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 6000 ఆర్‌పిఎమ్ వద్ద 47.5 బిహెచ్‌పిల గరిష్ట శక్తిని, 3500 ఆర్‌పిఎమ్ వద్ద 69 ఎన్ఎమ్‌ల గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్ సిస్టమ్‌తో లభిస్తుంది.
పెట్రోల్ వెర్షన్ ఆల్టో 800 లీటరుకు 22.74 కి.మీ. మైలేజీని, సిఎన్‌జి వెర్షన్ ఆల్టో 800 కేజీకి 30.46 కి.మీ. మైలేజీని (ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం) ఆఫర్ చేస్తుందని కంపెనీ పేర్కొంది.


Click it and Unblock the Notifications








