మారుతి సియాజ్ కోసం 6000 యూనిట్లకు పైగా బుకింగ్స్

By Ravi

మారుతి సుజుకి ఇండియా మరికొద్ది రోజుల్లో మార్కెట్లో విడుదల చేయనున్న తమ సరికొత్త మిడ్-సైజ్ సెడాన్ 'సియాజ్' (Ciaz) కోసం కంపెనీ సెప్టెంబర్ 3, 2014వ తేది నుంచే బుకింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసినదే. కాగా.. ఈ మోడల్ విడుదలకు ముందే రికార్డు స్థాయిలో బుకింగ్‌లను దక్కించుకుంటోంది. సియాజ్ కోసం ఇప్పటికే దేశవ్యాప్తంగా 6000 యూనిట్లకు పైగా బుకింగ్స్ వచ్చినట్లు సమాచారం.

మారుతి సుజుకి సియాజ్ ఇప్పటికే కొన్ని ప్రముఖ డీలర్ల స్టాక్ యార్డులకు చేరిపోయినప్పటికీ, సదరు డీలర్లు మాత్రం దీనిని ఇంకా తమ షోరూమ్‌లో ప్రదర్శనకు ఉంచలేదు. అయినప్పటికీ, కస్టమర్లు మాత్రం మారుతి సుజుకి సియాజ్ సెడాన్‌ను ప్రత్యక్షంగా చూడకుండానే బుకింగ్ చేసుకోవటం విశేషం. అక్టోబర్ మొదటి వారంలో ఈ కారును కస్టమర్లకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు మారుతి సన్నాహాలు చేస్తోంది.

Ciaz

కేవలం రూ.21,000 అడ్వాన్సు మొత్తంతో మారుతి సుజుకి డీలర్లు సియాజ్ బుకింగ్‌లను స్వీకరిస్తున్నారు. మారుతి సుజుకి సియాజ్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో, మొత్తం ఏడు రంగులలో లభ్యం కానుంది.

దేశీయ విపణిలో మారుతి సుజుకి సియాజ్ ధరలు రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. ఇది ఈ సెగ్మెంట్లో నేరుగా హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా, ఫోర్డ్ ఫియస్టా వంటి మోడళ్లతో పోటీ పడనుంది. ఈ కారుకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Thursday, September 18, 2014, 11:35 [IST]
English summary
Maruti Suzuki has now opened booking for its Ciaz in India. Dealers have begun accepting booking for an advance of INR 21,000. The dealers claim to have already booked more than 6,000 Ciaz since bookings have opened.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+