హోండా సిటీ అమ్మకాలను ఓవర్‌టేక్ చేసిన మారుతి సియాజ్

By Ravi

మారుతి సుజుకి ఇండియా ఇటీవలే విడుదల గ్లోబల్ మోడల్ సియాజ్ సెడాన్, భారత మార్కెట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోతోంది. సరికొత్త డిజైన్ ఫిలాసఫీ, ప్రీమియం ఫీచర్స్, లగ్జరీ ఫీల్‌నిచ్చేలా తయారు చేసిన మారుతి సియాజ్ కస్టమర్లను తొలి చూపులోనే ఆకట్టుకుంటోంది.

సియాజ్ రాకముందు వరకూ ఈ సెగ్మెంట్లో బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా హోండా సిటీ మోడల్ అమ్మకాలను మారుతి సియాజ్ ఓవర్‌టేక్ చేసింది. అక్టోబర్ 2014 నెలలో హోండా మొత్తం 5,120 సిటీ కార్లను విక్రయిస్తే, మారుతి 6,345 యూనిట్ల సియాజ్ కార్లను విక్రయించింది.


ఈ పోటీని తట్టుకునేందుకు హోండా కార్స్ ఇండియా, తమ సిటీ సెడాన్ ఉత్పత్తిని పెంచేందుకు సిద్ధమవుతోంది. రాజస్థాన్‌లోని తపుకరా ప్లాంట్‌లో రెండవ ప్రొడక్షన్ షిఫ్ట్‌ని ప్రారంభించి, సిటీ ఉత్పత్తిని పెంచడం ద్వారా ఈ మోడల్ వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించి, అమ్మకాలను పెంచుకోవాలని కంపెనీ యోచిస్తోంది.

ఇక మారుతి సియాజ్ విషయానికి వస్తే.. దేశీయ విపణిలో రూ.6.99 లక్షల (ఎంట్రీ లెవల్ పెట్రోల్ వేరియంట్ ధర, ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ప్రారంభ ధరకే కంపెనీ ఈ మోడల్‌ను విడుదల చేసింది. ఇది పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో, మొత్తం ఏడు రంగులు, 10 వేరియంట్లలో లభ్యమవుతుంది.

Honda City

సియాజ్ పెట్రోల్ వెర్షన్‌లో 1.4 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 92.45 పిఎస్‌ల శక్తిని, 130 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరుకు 20.73 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

మారుతి సుజుకి సియాజ్ పూర్తి వివరాల కోసం ఈ లింకుపై క్లిక్ చేయండి

సియాజ్ డీజిల్ వెర్షన్‌లో 1.3 లీటర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఈ ఇంజన్ గరిష్టంగా 90 పిఎస్‌ల శక్తిని, 200 ఎన్ఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరుకు 26.21 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ పేర్కొంది.

More from DriveSpark

Article Published On: Tuesday, November 4, 2014, 9:30 [IST]
English summary
Recently launched Ciaz becomes best selling model for Maruti Suzuki. The Maruti Ciaz outsold its biggest competitor, the Honda City, in the first month since its launch. Maruti sold 6,345 units of the Ciaz, while Honda sold only 5,120 units of the City in October 2014.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+