అక్టోబర్ 6న మారుతి సుజుకి సియాజ్ విడుదల

By Ravi

మారుతి సుజుకి సియాజ్ సెడాన్ విడుదలకు ముహుర్తం ఖరారైంది. అక్టోబర్ 6, 2014వ తేదీన మారుతి సియాజ్ సెడాన్‌కు బెంగుళూరు వేదికగా చేసుకొని గ్లోబర్ ప్రీమియర్ నిర్వహించనున్నారు. ఈమేరకు కంపెనీ మీడియాకు ఆహ్వానాలు కూడా పంపింది. మారుతి సుజుకి ఇండియా వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) తరుణ్ గార్గ్ 'సియాజ్'ను ఆవిష్కరించనున్నారు.

మిడ్-సైజ్ సెడాన్ సెగ్మెంట్లో సంచలనాలు సృష్టించేందుకు వస్తున్న 'సియాజ్' సెడాన్ కోసం కంపెనీ సెప్టెంబర్ 3, 2014వ తేది నుంచే బుకింగ్స్ ప్రారంభించిన సంగతి తెలిసినదే. కేవలం రూ.21,000 అడ్వాన్సు మొత్తంతో మారుతి సుజుకి డీలర్లు సియాజ్ బుకింగ్‌లను స్వీకరిస్తున్నారు. మారుతి సుజుకి సియాజ్ పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో, మొత్తం ఏడు రంగులలో లభ్యం కానుంది.

Maruti Suzuki Ciaz To Be Launched On 6th October

దేశీయ విపణిలో మారుతి సుజుకి సియాజ్ ధరలు రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. ఇది ఈ సెగ్మెంట్లో నేరుగా హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా, ఫోర్డ్ ఫియస్టా వంటి మోడళ్లతో పోటీ పడనుంది. ఈ కారుకు సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Tuesday, September 30, 2014, 10:29 [IST]
English summary
Maruti Suzuki India is all set to launch its new mid-size sedan Ciaz on 6th October, 2014. Maruti dealers have begun accepting booking for an advance of INR 21,000.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+