యూరప్‌కు మారుతి సుజుకి కార్ల ఎగుమతి బంద్
మారుతి సుజుకి భారతదేశపు అగ్రగామి కార్ కంపెనీయే కావచ్చు, కానీ విదేశాల్లో మాత్రం ఈ బ్రాండ్ హవా అంతమాత్రం. మారుతి సుజుకి సంస్థకు అంతర్జాతీయ మార్కెట్లలో అతి ప్రధానమైనది యూరప్ మార్కెట్. మారుతి సుజుకి మొత్తం ఎగుమతుల్లో 30 శాతం ఈ మార్కెట్ వాటా యూరప్‌దే.
అంతకు ముందుక ఆర్థిక సంవత్సరంతో పోల్చుకుంటే 2014 ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజుకి యూరప్ ఎగుమతులు 24,000 యూనిట్ల నుంచి 30,000 యూనిట్లకు పెరిగాయి. యూరప్ మార్కెట్లలో మారుతి సుజుకి వ్యాపారం బాగానే సాగుతున్నప్పటికీ, కంపెనీ రానున్న ఏప్రిల్ నుంచి జూన్ వరకు ఎగుమతులు నిలిపి వేయాల్సిన పరిస్థి ఏర్పడింది. కారణం ఏంటంటే..
ఇది కూడా చదవండి: 2014 వోల్వో ఎస్80 విడుదల
ప్రస్తుతం మారుతి సుజుకి కేవలం ఏ-స్టార్ మోడల్‌ను మాత్రమే యూరప్‌కు ఎగుమతి చేస్తోంది. ఇప్పటికే భారతదేశంలో ఏ-స్టార్ ఉత్పత్తిని నిలిపివేసిన మారుతి సుజుకి త్వరలోనే యూరప్ మార్కెట్లలో కూడా ఈ మోడల్‌ను నిలిపి వేయనుంది. మారుతి ఇటీవలే తమ చివరి బ్యాచ్‌గా 15,000 ఏ-స్టార్ కార్లను యూరప్‌కు ఎగుమతి చేసింది. వీటి తర్వాత ఇక ఏ-స్టార్ యూరప్ మార్కెట్లో లభ్యం కాదు.

అంతర్జాతీయ మార్కెట్లలో ఏ-స్టార్ స్థానాన్ని కొత్త సెలెరియో రీప్లేస్ చేయనుంది. యూరప్ మార్కెట్ల కోసం ఈ కారును థాయ్‌లాండ్ లోని సుజుకి ప్లాంటులో తయారు చేయనున్నారు. భారత్‌లో మారుతి సుజుకి తయారు చేస్తున్న కేవలం యూరో 4 కాలుష్య నిబంధనలను మాత్రమే పాటిస్తుండటం వలన ఇది యూరప్ మార్కెట్లకు సూట్ అవ్వదు. అక్కడి మార్కెట్లకు యూరో 5 కాలుష్య నిబంధనలు కలిగిన సెలెరియో అవసరం.
థాయ్‌లాండ్‌లోని సుజుకి ప్లాంటులో తయారవుతున్న కారు యూరో 5 నిబంధనలు పాటిస్తుంది కాబట్టి, యూరప్ మార్కెట్ల కోసం ఈ ప్లాంటులో తయారైన కారును మాత్రమే ఎగుమతి చేస్తారు. ఏదేమైనప్పటికీ, మారుతి సుజుకి మాత్రం సెప్టెంబర్ 2015లో యూరప్ మార్కెట్‌కు ఎగుమతులను తిరిగి ప్రారంభించే అవకాశం ఉంది. అయితే, ఆ సమయానికి మారుతి సుజుకి ఓ సరికొత్త ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ (వైఆర్ఏ కోడ్ నేమ్)ను విడుదల చేయనున్నట్లు సమాచారం.
మారుతి సుజుకి ఎగుమతుల్లో ఈ 15 నెలల అంతరాయం వలన 10 శాతం ఎగుమతులు తగ్గనున్నాయి. ఈ నేపథ్యంలో, మారుతి తమ ఎగుమతుల నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు మిగిలిన ఇతర దేశాలకు కంపెనీ తమ ఎగుమతుల సామర్థ్యాన్ని పెంచే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications








