సంవత్సరానికి 30 లక్షల మారుతి సుజుకి కార్లు!
గడచిన 30 సంవత్సరాలుగా పర్సనల్ ట్రాన్స్‌పోర్ట్ వాహనాలను విక్రయిస్తూ వస్తున్న భారతదేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా, దేశీయ విపణిలో తనకంటూ ఓ ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్‌ను సంపాధించుకుంది. భారతదేశంలో కెల్లా అత్యంత విశ్వసనీయ కార్ బ్రాండ్‌గా అవతరించిన మారుతి సుజుకి, ఇకపై ఏటా 30 లక్షల వాహనాలను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఇది కూడా చదవండి: రెగ్యులర్ కార్లలో ఫార్ములా వన్ ఇంజన్ ఆయిల్ వాడితే..
ఈ లక్ష్యానికి 'మారుతి 2.0' (Maruti 2.0) అనే పేరును పెట్టారు. తమ లక్ష్యం గురించి మారుతి సుజుకి ఇండియా (ఎమ్ఎస్‌ఐ) చైర్మన్ ఆర్‌సి భార్గవ వివరిస్తూ.. అంతర్జాతీయ మార్కెట్లో కూడా అధిక వాటాను కైవసం చేసుకునేందుకు మారుతి ప్రయత్నిస్తోందని, రానున్న ఐదేళ్ల కాలంలో ఏటా 20 లక్షల వాహనాలను విక్రయించాలనే లక్ష్యంతో ఉన్నామని, ఇందుకోసం రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌ను మెరుగు పరచడం, అన్ని మోడళ్ల కార్ల ఇంధన సామర్థ్యాన్ని పెంచడం, పర్యావరణాకి సానుకూలంగా ఉండే వాహనాలను తయారు చేయటం వంటి పలు కార్యక్రమాలు చేపడుతామని ఆయన వివరించారు.

ప్రస్తుతం తాము విక్రయిస్తున్న అన్ని మోడళ్లలో డీజిల్, సిఎన్‌జి, ఎల్‌పిజి వేరియంట్ల సామర్థ్యాన్ని పెంచుతామని, త్వరలోనే 800సీసీ డీజిల్ ఇంజన్‌తో నడిచే ఓ కాంపాక్ట్ కారును కూడా విడుదల చేస్తామని ఆయన తెలిపారు. ఇవే కాకుండా.. ఎలక్ట్రిక్ వాహనాలు, హైబ్రిడ్ వాహనాలను భారత మార్కెట్లో విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్నామని మారుతి 2013-14 ఆర్థిక సంవత్సరం నివేదికను వెల్లడించిన తర్వాత, వాటాదారుల సమావేశంలో భార్గవ ఈ విషయాలను వెల్లడించారు.


Click it and Unblock the Notifications








