ఏఎమ్‌టి మోడళ్ల ఉత్పత్తిని పెంచనున్న మారుతి సుజుకి

By Ravi

మారుతి సుజుకి ఇండియా దేశీయ విపణిలో మొట్టమొదటి సారిగా ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) టెక్నాలజీతో కూడిన సెలెరియో కారును విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఆ తర్వాత తాజాగా.. కంపెనీ తమ సరికొత్త ఆల్టో కె10 కారులో కూడా ఇదే టెక్నాలజీతో కూడిన ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఆఫర్ చేయనుంది.

సెలెరియో ఏఎమ్‌టికి ఇప్పటికే భారీ డిమాండ్ ఉంది. ఆల్టో కూడా కంపెనీ నుంచి అత్యధికంగా అమ్ముడుపోతున్న మోడల్. మరోవైపు ఇందులో ఏఎమ్‌టి ఆప్షన్ అందుబాటులోకి రావటం మరియు ఇది సెలెరియో ఏఎమ్‌టి కన్నా తక్కువ ధరను కలిగి ఉండటం చూస్తుంటే, కంపెనీ ఏఎమ్‌టి మోడళ్ల డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది.

Maruti Suzuki To Increase AMT Models Production

ఈ నేపథ్యంలో, మారుతి సుజుకి తమ ఏఎమ్‌టి కిట్‌ల సరఫరాను మరింత పెంచుకోనుంది. మారుతి కార్లలో ఉపయోగిస్తున్న ఏఎమ్‌టి గేర్‌బాక్స్‌లను ఇటలీకి చెందిన మాగ్నెటి మారెల్లీ సప్లయ్ చేస్తోంది. ప్రస్తుతం నెలకు 3,500 యూనిట్లుగా ఉన్న ఏఎమ్‌టి కిట్‌ల సప్లయ్‌ని రానున్న రెండు నెలల్లో 5,000 యూనిట్లకు పెంచనున్నారు. దీని వలన ఏఎమ్‌టి మోడళ్ల వెయిటింగ్ పీరియడ్ తగ్గే ఆస్కారం ఉంటుంది.

ఇదిలా ఉంటే.. మారుతి సుజుకి ఇండియా తమ సరికొత్త ఆల్టో కె10 మోడల్‌ను ఈనెల 3వ తేదీన న్యూఢిల్లీలో విడుదల చేయనుంది. సరికొత్త డిజైన్, ఫీచర్లతో లభ్యం కానున్న ఈ కారుకు సంబంధించి మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Saturday, November 1, 2014, 12:52 [IST]
English summary
Maruti Suzuki is mulling to increase the production of its AMT models due to the high demand the new Celerio AMT and ready to launch the new Alto K10.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+