మారుతి సుజుకి క్వీన్ ఆఫ్ ది రోడ్ కాంటెస్ట్

By Ravi

మారుతి సుజుకి భారతీయ మహిళల కోసం మరోసారి తమ క్వీన్ ఆఫ్ ది రోడ్ కాంటెస్ట్‌తో మీ ముందుకు వచ్చింది. మహిళా డ్రైవర్లలో అవగాహనను పెంచేందుకు మరియు ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మారుతి డ్రైవింగ్ స్కూళ్లలో ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని కంపెనీ ప్రారభించింది.

మెట్రో నగరాల్ల నివశించే 18 ఏళ్లు అంతకు మించి వయస్సు కలిగి ఉండి, చెల్లుబాటు కలిగిన డ్రైవింగ్ లైసెన్స్, కార్పోరేట్ ఐడిలను కలిగి ఉన్న మహిళల కోసం "సేఫ్ ఉమెన్ డ్రైవర్ కాంటెస్ట్‌"ను మారుతి డ్రైవింగ్ స్కూల్ ఆఫర్ చేస్తుంది. ఈ కాంటెస్ట్‌లో పాల్గొని రోడ్ ఆఫ్ ది క్వీన్‌గా నిలిచిన విజేత రూ.50,000 విలువైన బహుమతులను గెలుచుకోవచ్చు.

Maruti Suzuki Queen Of The Road Contest

కాంటెస్ట్‌కు అర్హత:
* 18 ఏళ్లు అంతకు మించి వయస్సు కలిగి ఉండి, చెల్లుబాటు కలిగిన డ్రైవింగ్ లైసెన్స్, కార్పోరేట్ ఐడిలను కలిగి ఉన్న మహిళలు.
* కార్పోరేట్ ఉద్యోగస్తుల భార్యలు కూడా అర్హులే.

కాంటెస్ట్ వివరాలు:
* విజేత ఎంపికను ఆన్‌లైన్ క్విజ్ ఫలితాలు, మారుతి డ్రైవింగ్ స్కూల్‌లో ప్రాక్టికల్ డ్రైవింగ్ టెస్ట్ ద్వారా చేయబడుతుంది.
* ఈ ఆన్‌లైన్ క్విజ్‌లో 20 ప్రశ్నలు ఉంటాయి, వాటికి 15 నిమిషాల్లో సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
* "క్వీన్ ఆఫ్ ది రోడ్" టైటిల్‌ను గెలుచుకున్న విజేతకు రూ.50,000 విలువైన బహుమతి.

ఈ కాంటెస్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు, రిజిస్ట్రేషన్ కోసం http://roadsafetyquiz.com/ వెబ్‌సైట్‌ను సందర్శించండి.

More from DriveSpark

Article Published On: Friday, March 7, 2014, 16:42 [IST]
English summary
Maruti Suzuki is celebrating Women's Day with the Queen of the Road Contest. Fill in the details below and answer 20 questions within 15 minutes. Shortlisted participants would then take a practical test at Maruti Driving School and stand a chance to win prizes worth Rs. 50,000.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+