లిమిటెడ్ ఎడిషన్ మారుతి స్విఫ్ట్, డిజైర్ కార్ల విడుదల

By Ravi

ప్రస్తుత పండుగ సీజన్ నేపథ్యంలో, కస్టమర్ల దృష్టిని ఆకట్టుకునేందుకు కార్ల తయారీ కంపెనీలు రెగ్యులర్ వేరియంట్లతో పోల్చుకుంటే అదనపు ఫీచర్లను జోడించిన లిమిటెడ్ ఎడిషన్ మోడళ్లను విడుదల చేస్తున్న సంగతి తెలిసినదే. సెలెరియో కోసం ఇటీవలే విఎక్స్ఐ ప్యాకేజ్‌ని ప్రవేశపెట్టిన మారుతి సుజుకి ఇండియా, తాజాగా స్విఫ్ట్, డిజైర్ మోడళ్లలో కూడా లిమిటెడ్ ఎడిషన్లను ప్రవేశపెట్టింది.

స్విఫ్ట్ సిల్వర్ ప్లస్, డిజైర్ రెగాలియా అనే పేర్లతో కంపెనీ ఇందులో రెండు లిమిటెడ్ ఎడిషన్ మోడళ్లను విడుదల చేసింది. ఈ లిమిటెడ్ ఎడిషన్లలో అదనపు యాక్ససరీలు లభ్యం కానున్నాయి.

మారుతి స్విఫ్ట్ సిల్వర్ ప్లస్ ఎడిషన్‌లో కొత్త సోనీ ఆడియో అండ్ స్పీకర్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, కొత్త సీటింగ్, నెక్ పిల్లోస్, బ్యాక్ కుషన్ ఫీచర్లను కంపెనీ ఆఫర్ చేస్తోంది. ఈ ఫీచర్ల మార్కెట్ విలువ రూ.31,745. అయితే, కంపెనీ వీటిని 27,500లకే విక్రయిస్తోంది. అంటే ఈ వేరియంట్ కొనుగోలుపై రూ.4,245లు ఆదా చేసుకోవచ్చన్నమాట.

Maruti Suzuki Swift Dzire Limited Editions Launched

మారుతి స్విఫ్ట్ డిజైర్ రెగాలియా ఎడిషన్‌లో లెథర్ సీట్స్, ఫాక్స్ ఉడ్ ఇన్‌సెర్ట్స్, కొత్త ఫ్లోర్ మ్యాట్స్, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, కొత్త స్టిక్కర్స్, రెగాలియా బ్యాడ్జింగ్ వంటి మార్పులు ఉన్నాయి. ఈ ఫీచర్ల మార్కెట్ విలువ రూ.18,810. అయితే, కంపెనీ వీటిని 13,800లకే విక్రయిస్తోంది. అంటే ఈ వేరియంట్ కొనుగోలుపై రూ.5,010లు ఆదా చేసుకోవచ్చన్నమాట.

More from DriveSpark

Article Published On: Tuesday, September 30, 2014, 18:02 [IST]
English summary
Maruti Suzuki India has launched limited edition versions of its Swift and Dzire. Named as Swift Silver Plus and Dzire Regalia are equipped with additional features.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+