ప్రభుత్వానికి మారుతి సుజుకి స్విఫ్ట్ హైబ్రిడ్ కార్ల సరఫరా

By Ravi

భారత సర్కారు త్వరలోనే మారుతి సుజుకి స్విఫ్ట్ హైబ్రిడ్ కార్లను ఉపయోగించనుంది. గడచిన ఫిబ్రవరిలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో మారుతి సుజుకి తమ స్విఫ్ట్ హైబ్రిడ్ కారును ప్రదర్శనకు ఉంచింది. ఈ కారుకు కంపెనీ పెట్టిన పేరు 'మారుతి సుజుకి స్విఫ్ట్ రేంజ్ ఎక్స్టెండర్' (Maruti Suzuki Swift Range Extender).

భారత ప్రభుత్వం చేపట్టనున్న ఓ పైలట్ ప్రాజెక్టు కోసం మారుతి సుజుకి ఇండియాకు కంపెనీ కొన్ని స్విఫ్ట్ హైబ్రిడ్ కార్లకు ఆర్డర్లు ఇచ్చినట్లు సమాచారం. ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న సన్నిహిత వర్గాలు తెలిపిన దాని ప్రకారం, ఈ హైబ్రిడ్ స్విఫ్ట్ కార్ల తయారీ ఇప్పటికే దాదాపుగా పూర్తయిందని, ప్రభుత్వం ఏఆర్ఏఐ ఫ్యూయెల్ ఎఫీషియెన్సీ సర్టిఫికేషన్ కోసం ఎదురుచూస్తోందని తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: గాలితో నడిచే హైబ్రిడ్ కారు

ప్రస్తుతానికి ఈ పైలట్ ప్రాజెక్టుకు సంబంధించిన సమాచారం తెలియకపోయినప్పటికీ, ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత, 204-15 ఆర్థిక సంవత్సరంలో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే ఆస్కారం ఉంది. మారుతి సుజుకి స్విఫ్ట్ రేంజ్ ఎక్స్టెండర్ కార్లను ఉండియాలోనే తయారు చేసినప్పటికీ బ్యాటరీ, ఎలక్ట్రిక్ మోటార్ వంటి విడిభాగాలను జపాన్ నుంచి ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకోనున్నట్లు తెలుస్తోంది.

Maruti Swift Range Extender

మారుతి సుజుకి స్విఫ్ట్ రేంజ్ ఎక్స్టెండర్ కారులో ఓ త్రీ-సిలిండర్ ఇన్‌లైన్ 658సీసీ పెట్రోల్ ఇంజన్‌ను మరియు ఓ 74 హెచ్‌పి ఎలక్ట్రిక్ మోటార్‌ను (ఫ్రంట్ యాక్సిల్‌లో అమర్చబడి ఉంటుంది) ఉపయోగించనున్నారు. ఈ ఎలక్ట్రిక్ మోటార్ 5 కి.వా. లిథియం అయాన్ బ్యాటరీ సాయంతో పరుగులు తీస్తుంది. ఇది కేవలం 90 నిమిషాల్లోనే పూర్తిగా చార్జ్ అవుతుంది.

ఈ స్విప్ట్ హైబ్రిడ్ కారు గరిష్టంగా 48.2 కిలోమీటర్ల మైలేజీనిస్తుంది. కేవలం ఎలక్ట్రిక్ పవర్‌తోనే ఈ కారులో 25.5 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. స్విఫ్ట్ రేంజ్ ఎక్స్టెండర్ రెగ్యులర్ స్విఫ్ట్ కన్నా 130 కేజీల అదనపు బరువును కలిగి ఉంటుంది (మొత్తం బరువు 1020 కేజీలు ఉంటుంది). మరి ప్రభుత్వం నిర్వహించనున్న ఈ పైలట్ ప్రాజెక్ట్ గురించి మీకేమైనా అవగాహన/అంచనా ఉందా..?

Article Published On: Thursday, March 27, 2014, 11:00 [IST]
English summary
Maruti Suzuki Swift Range Extender is the name of the plug-in hybrid version of the popular hatchback. The Swift Range Extender was showcased at the 2014 Auto Expo last month.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+