మారుతి సుజుకి స్విఫ్ట్ లిమిటెడ్ ఎడిషన్ ఆవిష్కరణ

By Ravi

గడచిన కొద్ది నెలలుగా అమ్మకాలు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో, దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి, తమ ఫ్లాగ్‌షిప్ మోడళ్లలో అదనపు ఫీచర్లతో కూడిన లిమిటెడ్/స్పెషల్ ఎడిషన్ మోడళ్లను విడుదల చేస్తూ వస్తోంది.

తాజాగా, కంపెనీ ఇటీవలే విడుదల చేసిన మారుతి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ మోడల్‌లో కూడా ఇలాంటి ఓ లిమిటెడ్ ఎడిషన్‌ను మారుతి సుజుకి పరిచయం చేసింది. మహారాష్ట్రలోని లూనావాలాలో జరిగిన విండ్‌సాంగ్ మ్యూజిక్ ఫెస్టివల్‌లో కంపెనీ ఓ లిమిటెడ్ ఎడిషన్ స్విఫ్ట్‌ను ఆవిష్కరించింది.


మ్యూజిక్ ప్రియులను లక్ష్యంగా చేసుకొని మారుతి సుజుకి ఈ లిమిటెడ్ ఎడిషన్ స్విఫ్ట్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. ఇవి కేవలం 100 యూనిట్లు మాత్రమే అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది. వైట్ కలర్ స్విఫ్ట్‌పై ఆకర్షనీయమైన గ్రాఫిక్స్‌తో ఈ లిమిటెడ్ ఎడిషన్‌ను డిజైన్ చేశారు.

ఈ కొత్త లిమిటెడ్ ఎడిషన్ మారుతి సుజుకి స్విఫ్ట్ కారు ఏ, బి పిల్లర్స్ మరియు రూఫ్‌ను బ్లాక్ కలర్‌లో పెయింట్ చేశారు. బానెట్‌పై రెండు బ్లాక్ కలర్ స్ట్రైప్స్ ఉంటాయి. కారు సైడ్స్‌పై ట్రైకలర్ స్ట్రైప్స్, మ్యూజికల్ సింబల్స్ ఉంటాయి. దీని అల్లాయ్ వీల్స్‌ను నిండు పసుపు రంగులో పెయింట్ చేశారు.

అయితే, ఈ ఫొటోల్లో చూపించినట్లుగా ప్రతి లిమిటెడ్ ఎడిషన్ స్విఫ్ట్ కూడా ఇలా హెడ్-ఫోన్ డిజైన్‌తో (వెనుక వైపు) లభిస్తుందా లేదా అనే విషయం మాత్రం తెలియరావట్లేదు. అలాగే, దీని ఇంటీరియర్‌లో కూడా పలు మార్పులు చేర్పులు ఉన్నట్లు తెలుస్తోంది.

Maruti Swift Special Edition at WindSong Music Festival

ఈ లిమిటెడ్ ఎడిషన్ స్విఫ్ట్‌లో మెకానికల్‌గా ఎలాంటి మార్పులు లేవు. కొత్త 2014 స్విఫ్ట్ పెట్రోల్ వెర్షన్‌లో ఉపయోగించిన 1.2 లీటర్ ఇంజన్ 83.1 బిహెచ్‌పిల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది లీటరుకు 20.4 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది (ఏఆర్ఏఐ సర్టిఫైడ్ మైలేజ్). అలాగే, కొత్త 2014 స్విఫ్ట్ డీజిల్ వెర్షన్‌లో ఉపయోగించిన 1.3 లీటర్ ఇంజన్ లీటరుకు 25.2 కిలోమీటర్ల మైలేజీని ఆఫర్ చేస్తుంది (ఏఆర్ఏఐ సర్టిఫైడ్ మైలేజ్).

More from DriveSpark

Article Published On: Thursday, November 13, 2014, 17:15 [IST]
English summary
Maruti Suzuki has showcased a new 2014 Swift limited edition at the Windsong Music Festival in Lonavala, Maharashtra. It is reported that only 100 examples of this limited edition will be produced.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+