డొక్కు కారు అమ్మిన మారుతికి రూ.3.85 లక్షల జరిమానా
కస్టమర్‌కు లోపాలున్న కారును విక్రయించినందుకు గాను మారుతి ఉద్యోగ్ లిమిటెడ్‌కు వినియోగదారుల ఫోరమ్ రూ.3.85 లక్షల జరిమానా విధించింది. లోపభూయిష్టమైన మారుతి వ్యాగన్ ఆర్ విక్రయించినందుకు గాను న్యూఢిల్లీ డిస్ట్రిక్ట్ కన్జ్యూమర్ డిస్ప్యూట్స్ రెడ్రసల్ ఫోరమ్ కంపెనీకు ఈ జరిమానా వేసింది.
భారకదేశంలో కెల్లా అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ అయిన మారుతి ఉద్యోగ్ లిమిటెడ్ 2006లో ఓ వ్యాగన్ ఆర్ కారును రూ.3.88 లక్షలకువీణా అమ్‌లానీ అనే కస్టమర్‌కు విక్రయించింది. అయితే, సదరు కస్టమర్ కారు కొన్న తర్వాత నుంచి అనేక మార్లు లోపాలు తలెత్తడం, సదరు లోపాలు తయారీ లోపాలుగా గుర్తించడంతో ఫోరమ్ ఈ తీర్పు వెల్లడించింది.

సికె చతుర్వేది అక్ష్యకత కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ కారు తయారీలోనే లోపం ఉందని, గేర్ సిస్టమ్‌తో పాటు ఇంజన్‌లో సైతం సమస్యలు ఉండటం వలన కస్టమర్ అనేక పర్యాయాలు ఆ కారును మారుతి సర్వీస్ సెంటర్‌కు తీసుకువెళ్లటం జరిగింది. సంవత్సరన్నర కాలంలో 10 సార్లు మరమ్మతుకు తెచ్చినట్లు మారుతి కూడా ఒప్పకుంది.
కాగా.. ఆ కారు కొనుగోలు చేసిన ఏడు సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో, కొత్త కారును మార్చుకోవడానికి వీల్లేదు కాబట్టి ఫిర్యాదుదారుడికి రూ.3.5 లక్షలతో పాటు కోర్టు ఖర్చులకు గాను రూ.35,000 చెల్లించాల్సిందిగా ఈ ఫోరమ్ మారుతిని ఆదేశించింది.
వీణా అమ్‌లానీ అక్టోబర్ 2006లో కారు కొనుగోలు చేసినట్లు కొనుగోలుచేసిన తర్వాత నుంచి గేర్లు వేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నానని పలుసార్లు మరమ్మతు చేసినా ఇబ్బంది మాత్రం తొలగలేదని పేర్కొన్నారు. అయితే, మారుతి మాత్రం ఈ ఫిర్యాదుని ఖండిస్తోంది. అన్ని నాణ్యత పరమైన పరీక్షలు నిర్వహించిన తర్వాతనే కారును డెలివరీ చేస్తామని, ఈ నేపథ్యంలో తయారీ సమస్యలు ఎదురయ్యే ఆస్కారం లేదని వాదిస్తోంది.


Click it and Unblock the Notifications








