త్వరలో భారత్‌లో మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఏ విడుదల

By Ravi

భారత లగ్జరీ కార్ మార్కెట్లో పోటీ గణనీయంగా పెరుగుతోంది. ఈ సెగ్మెంట్లో కార్ కంపెనీలు కొత్త ఉత్పత్తులను విడుదల చేసి, కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. ఇందులో భాగంగానే, జర్మన్ లగ్జరీ కార్ మెర్సిడెస్ బెంజ్, భారత్‌లో తమ అత్యంత శక్తివంతమైన కాంపాక్ట్ సెడాన్ సిఎల్ఏ45 ఏఎమ్‌జిని విడుదల చేసిన సంగతి తెలిసినదే. తాజాగా మెర్సిడెస్ బెంజ్ మరో సరికొత్త కారును విడుదల చేయనుంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన 2014 ఆటో ఎక్స్‌పోలో కంపెనీ ఆవిష్కరించిన కాంపాక్ట్ ఎస్‌యూవీ 'జిఎల్ఏ'ని అతి త్వరలోనే భారత్‌లో విడుదల చేయనుంది. మెర్సిడెస్ బెంజ్ తొలిసారిగా తమ జిఎల్ఏ ఎస్‌యూవీని 2013లో జరిగిన ఫ్రాంక్‌ఫర్ట్ మోటార్‌షోలో ప్రదర్శించింది.

భారత్‌లో విడుదల కానున్న మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఏ కాంపాక్ట్ ఎస్‌యూవీ పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభ్యం కావచ్చని అంచనా. గ్లోబల్ మార్కెట్లలో జిఎల్ఏ క్లాస్ మోడల్ రెండు పెట్రోల్, రెండు డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో లభిస్తోంది. అయితే, ఇండియాలో ఏయే ఇంజన్స్ లభిస్తాయనే విషయంపై ఇంకా స్పష్టత లేదు.

Mercedes Benz GLA

గ్లోబల్ మార్కెట్లలో లభిస్తున్న ఇంజన్ ఆప్షన్స్ ఇలా ఉన్నాయి:
* 1.6 లీటర్ పెట్రోల్ ఇంజన్, 156 హార్స్‌పవర్
* 2.6 లీటర్ పెట్రోల్ ఇంజన్, 211 హార్స్‌పవర్
* 2.2 లీటర్ డీజిల్ ఇంజన్, 136 హార్స్‌పవర్
* 2.2 లీటర్ డీజిల్ ఇంజన్, 170 హార్స్‌పవర్

భారత మార్కెట్లో మెర్సిడెస్ బెంజ్ జిఎల్ఏ క్లాస్ ధర రూ.25 లక్షల నుంచి రూ.35 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.

More from DriveSpark

Article Published On: Saturday, August 30, 2014, 14:52 [IST]
English summary
Mercedes-Benz India has termed 2014 as its 'Year of Excellence'. Keeping with their promise they had promised to launch ten new models in India. They recently launched its most powerful compact sedan in India, the CLA45 AMG. They have so far launched eight vehicles and two remain.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+