సెప్టెంబర్ 1 నుంచి ప్రియం కానున్న మెర్సిడెస్ బెంజ్ కార్ల ధరలు
జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా, వచ్చే నెల నుంచి దేశీయ విపణిలో విక్రయిస్తున్న తమ అన్ని మోడళ్ల ధరలను పెంచనుంది. సెప్టెంబర్ 1, 2014వ తేది నుంచి తమ కార్ల ధరలను, మోడల్‌ను బట్టి 2.5 శాతం వరకూ పెంచనున్నట్లు మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఓ ప్రకటనలో పేర్కొంది.
పెరుగుతున్న ఇన్‌పుట్ ఖర్చులు, అధిక ఎక్సేంజ్ ధరల కారణంగా ఈ ధరల పెంపు నిర్ణయం తీసుకోక తప్పలేదని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఎబర్‌హార్డ్ కెర్న్ తెలిపారు. ధరలు పెరిగినప్పటికీ, తాము తమ కస్టమర్ల కోసం మెర్సిడెస్ బెంజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి ఫ్లెక్సినామిక్స్, స్టార్ అగిలిటీ, స్టార్ లీజ్, స్టార్ సూపర్‌సోనిక్ మొదలైన స్కీమ్‌లు అందిస్తున్నామని ఆయన వివరించారు.

పైన పేర్కొన్న ఆర్థిక సేవలే కాకుండా తమ వినియోగదారుల కోసం స్టార్ కేర్, స్టార్ ఈజ్ అండ్ రోడ్ సైడ్ అసిస్టెన్ వంటి సర్వీసులను కూడా ఆఫర్ చేస్తున్నామని, ఈ సేవలన్నీ కూడా కస్టమర్ యొక్క ఓవరాల్ ఓనర్‌షిప్ ఎక్స్‌పీరియెన్స్‌ను మరింత పెంచుతాయని కెర్న్ చెప్పారు. ధరలు పెరగక ముందే మెర్సిడెస్ బెంజ్ కారును సొంతం చేసుకోవాలనుకుంటే ఈరోజే మీ సమీపంలోని షోరూమ్‌ను సందర్శించండి.


Click it and Unblock the Notifications








