2014లో 8 కొత్త కార్లు విడుదల చేస్తాం: మెర్సిడెస్ బెంజ్

By Ravi

జర్మన్ లగ్జరీ కార్‌మేకర్ మెర్సిడెస్ బెంజ్ ఈ సంవత్సరంలో (2014) ఎనిమిది కొత్త కార్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. గడచిన సంవత్సరంలో తాము చవిచూసిన రెండంకెల వృద్ధిని కొనసాగించే దిశలో భాగంగా, ఈ కొత్త ఉత్పత్తులను ఇండియాకు తీసుకువస్తామని కంపెనీ పేర్కొంది.

ఈ కొత్త ఉత్పత్తులతో పాటుగా, దేశంలోని చిన్న పట్టణాల్లో సైతం తమ ఉత్పత్తులు అందుబాటులో ఉండేలా, తమ డీలర్‌షిప్ నెట్‌వర్క్‌ను విస్తరించుకుంటామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఓ ప్రకటనలో తెలిపింది.

భారత్‌లో మెర్సిడెస్ బెంజ్ ఇండియాకు 2013 అత్యంత విజయవంతమైన సంవత్సరం అని, అంతకు ముందు సంవత్సరంతో పోల్చుకుంటే 2013లో తమ అమ్మకాలు 32 శాతం వృద్ధిని సాధించాయని మెర్సిడెస్ బెంజ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ ఎబర్‌హార్డ్ కెర్న్ తెలిపారు. అలాగే 2014లో కూడా రెండంకెల వృద్ధిని కొనసాగించగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Mercedes Benz India

ఈ వృద్ధిని ఇలానే కొనసాగించేందుకు, భారత్‌లో తమ కంపెనీ మరిన్ని కొత్త ఉత్పత్తులను ప్రవేశపెడుతుందని, 2013లో తాము విడుదల చేసినన్ని ఉత్పత్తులను ఈ ఏడాది కూడా విడుదల చేస్తామని కెర్న్ చెప్పారు. గడచిన సంవత్సరంలో (2013) మెర్సిడెస్ బెంజ్ భారత మార్కెట్లో మొత్తం 8 ఉత్పత్తులను విడుదల చేసింది. ఈ కొత్త ఉత్పత్తుల విడుదలపై కంపెనీ త్వరలోనే నిర్ణయం తీసుకుంటుందని, ఇందులో జిఎల్ఏ కాంపాక్ట్ స్పోర్ట్ యుటిలిటీ వాహనం మరియు సిఎల్ఏ క్లాస్ సెడాన్లు ఉంటాయని ఆయన వివరించారు.

More from DriveSpark

Article Published On: Friday, January 17, 2014, 13:22 [IST]
English summary
German luxury carmaker Mercedes Benz plans to launch about eight new products in India this year as part of plans to continue with the double digit growth that it witnessed last year.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+