నవంబర్ 25న కొత్త మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ విడుదల
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సెడెస్ బెంజ్ ఇండియా దేశీయ విపణిలో విక్రయిస్తున్న లగ్జరీ సెడాన్ సి-క్లాస్‌లో కంపెనీ ఓ అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను ఈనెలలో విడుదల చేయనుంది. కొత్త మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ ఫేస్‌లిఫ్ట్‌ను నవంబర్ 25, 2014వ తేదీ మార్కెట్లో విడుదల కానుంది.
మెర్సిడెస్‌కు ప్రపంచ వ్యాప్తంగా బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా ఉన్న సి-క్లాస్‌లో అప్‌గ్రేడెడ్ వెర్షన్‌ను ఈ ఏడాది జరిగిన 2014 డెట్రాయిట్ మోటార్ షోలో కంపెనీ తొలిసారిగా ఆవిష్కరించింది. ఈ కొత్త సి-క్లాస్ కారును కొత్త లైట్‌వెయిట్ మాడ్యులర్ రియర్-డ్రైవ్ ఎమ్ఆర్ఏ (మెర్సిడెస్ రియర్-డ్రైవ్ ఆర్కిటెక్చర్) ప్లాట్‌ఫామ్‌పై తయారు చేశారు.

కొత్త మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ కారు మొత్తం 4686 మి.మీ. పొడవును 1810 మి.మీ. వెడల్పును మరియు 1442 మి.మీ. ఎత్తును కలిగి ఉంటుంది. ప్రస్తుత వెర్షన్ సి-క్లాస్‌తో పోల్చి చూస్తే ఇది 95 మి.మీ. ఎక్కువ పొడవును, 40 మి.మీ. ఎక్కువ వెడల్పును మరియు 5 మి.మీ. ఎక్కువ ఎత్తును కలిగి ఉంటుంది. కొత్త సి-క్లాస్ వీల్‌బేస్ 2840 మి.మీ., మునుపటి వెర్షన్ కన్నా ఇది 80 మి.మీ. అధికం.

మొత్తమ్మీద చూస్తే, ప్రస్తుత సి-క్లాస్ కొత్త సి-క్లాస్ మరింత ఎక్కువ ఇంటీరియర్ స్పేస్‌ను, కంఫర్ట్‌ను ఆఫర్ చేయనుంది. కొత్త సి-క్లాస్ ఎక్స్టీరియర్‌ను గమనిస్తే ఇది లేటెస్ట్ ఎస్-క్లాస్ మరియు రివైజ్డ్ ఈ-క్లాస్ మోడళ్లను తలపిస్తుంది. ప్రారంభంలో భాగంగా, ఇండియాలో కొత్త సి-క్లాస్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభ్యం కానున్నట్లు సమాచారం. ఆ తర్వాతి కాలంలో డీజిల్ వెర్షన్లను విడుదల చేసే అవకాశం ఉంది. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.



Click it and Unblock the Notifications








