2015 మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ ఆవిష్కరణ
జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా అందిస్తున్న లగ్జరీ హ్యాచ్‌బ్యాక్ బి-క్లాస్‌లో కంపెనీ ఓ రిఫ్రెష్డ్ మోడల్‌ను పరిచయం చేసింది. వచ్చే నెలలో జరగనున్న ప్యారిస్ మోటార్ షోలో మెర్సిడెస్ బెంజ్ తమ సరికొత్త 2015 మోడల్ బి-క్లాస్ కారును ప్రదర్శనకు ఉంచనుంది. ఇందులో భాగంగానే, కంపెనీ తమ కొత్త బి-క్లాస్ ఫొటోలను, వివరాలను ఇంటర్నెట్‌లో విడుదల చేసింది.
ఈ కొత్త 2015 మెర్సిడెస్ బెంజ్ బి-క్లాస్ కారులో కొద్దిపాటి కాస్మోటిక్ అప్‌గ్రేడ్స్‌తో పాటుగా కొన్ని అదనపు ఫీచర్లు కూడా లభ్యం కానున్నాయి. ఈ కొత్త మోడల్ ఇండియన్ మార్కెట్లో కూడా విడుదల కానుంది. కారు లోపల, వెలుపల కూడా అప్‌గ్రేడ్స్ ఉండనున్నాయి.

మెర్సిడెస్ బెంజ్ తమ 2015 బి-క్లాస్ కారును మూడు డీజిల్ మరియు రెండు పెట్రోల్ ఇంజన్ ఆప్షన్లతో విడుదల చేయనుంది. ఇందులో ఆప్షనల్ ఎలక్ట్రిక్ డ్రైవ్ సిస్టమ్ కూడా ఉండనుంది. ఇందులో ఆప్షనల్ 4మ్యాటిక్ ఆల్-వీల్ డ్రైవ్ సిస్టమ్‌ను ఆఫర్ చేయనున్నారు.
జర్మనీలో కొత్త మెర్సిడెస్ బెంజ్ 2015 బి-క్లాస్ కారు ధర రూ.21.28 లక్షలుగా ఉండనుంది. అక్టోబర్‌లో విడుదల కానున్న ఈ లగ్జరీ హ్యాచ్‌బ్యాక్ డెలివరీలు మాత్రం నవంబర్ 2014 నుంచి ప్రారంభమవుతాయి. వచ్చే ఏడాది మధ్య భాగం నాటికి ఇది ఇండియా మార్కెట్లో విడుదల కావచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








