బ్రేకింగ్ న్యూస్: కోమా నుంచి బయటపడిన మైఖేల్ షుమాకర్

By Ravi

వరుసగా ఏడు సార్లు ఫార్ములా వన్ ఛాంపియన్‌షిప్‌ను గెలిచిన ప్రపంచ ప్రఖ్యాత ఫార్ములా వన్ రేసర్ మైఖేల్ షుమాకర్‌ గడచిన సవంత్సరం డిసెంబర్ నెలలో జరిగిన స్కీయింగ్ యాక్సిడెంట్‌లో తలకు బలమైన గాయం తగలడంతో కోమాలోకి వెళ్లిపోయిన సంగతి తెలిసినదే. మైఖేల్ షుమాకర్‌ను కోమా నుంచి బయటకు తీసుకువచ్చేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు మంచి ఫలితాలనిచ్చాయి.

గడచిన వారమే ఆయన ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు కనబడటం లేదని చెప్పిన వైద్యులు, తాజాగా అతను కోమా నుంచి బయటపడ్డారని, ఇంటెన్సివ్ కేర్ నుంచి కూడా డిశ్చార్జ్ అయ్యారని వెల్లడించారు. డిసెంబర్ 29న స్కీయింగ్ యాక్సిడెంట్ జరిగిన తర్వాత ఆయనను గ్రెనోబెల్ ఆస్పత్రిలో చేర్పించారు. అప్పటి నుండి ఆయనకు అక్కడే చికిత్స అందిస్తున్నారు.

Michael Schumacher Out Of Coma

మైఖేల్ షుమాకర్ దాదాపు ఆరు నెలల తర్వాత కోమా నుంచి బయటపడంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు. ఆయన మేనేజర్ సబిన్ కెమ్ విడుదల చేసిన ఓ అధికారిక ప్రకటనలో.. మైఖేల్ సిహెచ్‌యూ గ్రెనోబెల్ విడిచిపెట్టారని, తన సుదీర్ఘ రిహాబిలేషన్ దశను కొనసాగిస్తారని, అతను ఇక కోమా దశలో లేరని పేర్కొన్నారు.

మేఖేల్‌కు ప్రమాదం జరిగిన తొలిదశలో అతనికి ప్రథమ చికిత్స చేసిన వారి నుంచి గ్రెనోబెల్ ఆస్పత్రిలోని వైద్యులు, నర్సులు, థెరపిస్టులందరికీ ఆయన కుటుంబ సభ్యులు ధన్యవాదములు తెలిపారని, అంతేకాకుండా, మైఖేల్ షుమాకర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేసిన వారందరికీ కూడా తమ ధన్యవాదములు తెలిపారని సబిన్ తన ప్రకటనలో తెలిపారు. అయితే, కొన్ని కారణాల వలన మైఖేల్ షుమాకర్‌ను కొంతకాలం పాటు ప్రజలకు దూరంగా ఉంచనున్నట్లు ఆయన తెలిపారు.

More from DriveSpark

Article Published On: Monday, June 16, 2014, 17:36 [IST]
English summary
Formula One legend and multiple World Championship winner Michael Schumacher is out of coma and has been discharged from the Grenoble hospital nearly six months after his skiing accident.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+