ఎయిర్‌లెస్ టైర్ల తయారీ కోసం ప్లాంట్ ఏర్పాటు చేసిన మిచెలిన్
గతంలో పోలారిస్ సంస్థ గాలి అవసరం లేని ఎయిర్‌లెస్ టైర్లను అభివృద్ధి చేసినట్లు మనం చదువుకున్నాం. ఇప్పుడు తాజాగా.. ఫ్రాన్స్‌కి చెందిన ప్రముఖ టైర్ల తయారీ కంపెనీ మిచెలిన్, ఈ తరహా ఎయిర్‌లెస్ టైర్లను వాణిజ్య పరంగా ఉత్పత్తి చేసేందుకు సిద్ధమైంది.
ఈ మేరకు మిచెలిన్ నార్త్ అమెరికాలో ఓ ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ప్రారంభించింది. ఈ టైరును 'మిచెలిన్ ఎక్స్ ట్వీల్ ఎయిర్‌లెస్ రేడియల్ టైర్' అని పిలుస్తారు. ఇవి నాన్-న్యూమాటిక్ టైర్స్. కమర్షియల్ అప్లికేషన్స్ కోసం ఈ టైర్లను ఉపయోగించనున్నారు. మిచెలిన్ తమ ఎయిర్‌లెస్ టైర్లను తొలిసారిగా 2004 ప్యారిస్ మోటార్ షోలో ప్రదర్శనకు ఉంచింది.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

తర్వాతి స్లైడ్‌లలో మిచెలిన్ ఎయిర్‌లెస్ టైర్లకు సంబంధించిన మరింత సమాచారాన్ని తెలుసుకోండి.

గాలి అవసరం లేని ఈ టైర్లతో పంక్చర్ సమస్య అస్సలే ఉండదు, ఇవి త్వరగా అరిగిపోవు/చిరిగిపోవు. సాంప్రదాయ టైర్లతో పోల్చుకుంటే, ఈ ఎయిర్‌లెస్ టైర్ల జీవితకాలం కూడా ఎక్కువే.

ఎయిర్‌లెస్ టైర్లు కలిగిన వాహనాలతో ఎలాంటి రోడ్లు, ప్రాంతాల్లోనైనా లేదా అసలు రోడ్లే లేని చోట కూడా ప్రయాణించటం సాధ్యమవుతుంది.

సాధారణ టైర్ల మాదిరిగా నాన్-న్యుమాటిక్ టైర్లకు గాలి అవసరం లేదు. ఈ టైర్లలో ఎయిర్ కంపార్ట్‌మెంట్‌కు బదులుగా ధృడంగా అలాగే ఫ్లెక్సిబల్‌గా ఉండే ప్లాస్టిక్, రబ్బర్‌తో తయారు చేయబడిన స్పోక్స్ వంటి నిర్మాణం ఉంటుంది.

ఈ ఎయిర్‌లెస్ టైర్లు పంక్చర్లు కావు, పగిలిపోవు, అధిక వేగంతో వెళ్తున్నప్పటికీ ఇవి బరస్ట్ కాకుండా ఉండి ప్రమాదాల నుండి రక్షిస్తాయి. ఈ టైర్లు సురక్షితమైనవే కాకుండా ప్రకృతి సాన్నిహిత్యమైనవి కూడా. ఈ టైర్లను 100 శాతం రీసైకిల్ చేసుకోవచ్చు.


Click it and Unblock the Notifications








