నలుగురు లక్కీ ఇండియన్స్‌కి మలేషియన్ ఎఫ్1కి వెళ్లే చాన్స్
ఫ్రెంచ్ టైర్ కంపెనీ మిచెలిన్ భారత్‌లో 'డ్రైవర్ వాంటెడ్ కాంటెస్ట్' పేరిట ఓ పోటీని నిర్వహిస్తోంది. ఈ పోటీలో విజేతగా నిలిచిన వారికి మలేషియాలో జరగబోయే ఫార్ములా వన్ రేస్ ట్రాక్‌పై డ్రైవింగ్ అనుభూతిని పొందే అవకాశాన్ని మిచెలిన్ కల్పించనుంది.
ఈ పోటీలో పాల్గొనేందుకు గాను, అభ్యర్థులు తమ డ్రైవింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను వీడియో రూపంలో కానీ లేదా టెక్స్ట్ రూపంలో కానీ సమర్పించాల్సి ఉంటుంది. ఈ సమాచారాన్ని ఫేస్‌బుక్ లేదా ట్విట్టర్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా షేర్ చేయవచ్చు.
ఇది కూడా చదవండి: తెలంగాణా పోలీసులకు కొత్త వాహనాలు
ఇందులో మిచెలిన్ నలుగురు లక్కీ విజేతలను ఎంచుకొని, వారికి సెపాంగ్ ఇంటర్నేషల్ ఫార్ములా వన్ సర్క్యూట్‌కు వెళ్లేందుకు, ఆ రేస్ ట్రాక్‌పై డ్రైవ్ చేసేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఖర్చులను మిచెలిన్ సంస్థే భరిస్తుంది.

సూపర్‌కార్లు, ఫెర్ఫార్మెన్స్ రేస్‌లలో పాల్గొనాలనే లైఫ్ టైమ్ ఆపర్చ్యునిటీ కోసం ఎదురు చూసే వారు ఈ కాంటెస్ట్‌లో పాల్గొని తమ కలను నిజం చేసుకోవచ్చు. లాంబోర్గినీ సూపర్ ట్రోఫియో, రెనో క్లియ కప్, ఫార్ములా లీ మ్యాన్స్, ఫార్ములా 4 వాహనాలలో డ్రైవింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను అభ్యర్థులు సొంతం చేసుకోవచ్చు.
మిచెలిన్ డ్రైవర్ వాంటెడ్ కాంటెస్ట్ పోటీలో గెలిచిన వారు ఈ సూపర్ కార్లను రేస్ ట్రాప్‌పై పరుగులు పెట్టించవచ్చు. ఈ పోటీలో పాల్గొనదలచిన వారు driverwanted.in లింక్‌పై క్లిక్ చేసి రిజస్టర్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఫేస్‌బుక్, ట్విట్టర్‌ల ద్వారా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు 3500 మంది అభ్యర్థులు ఈ పోటీ కోసం రిజిస్టర్ చేసుకున్నారు. మొత్తం 16 దేశాల్లలో మిచెలిన్ ఈ కాంటస్ట్ నిర్వహిస్తోంది. మీ లక్ కూడా చెక్ చేసుకోవాలంటే, ఈ పోటీలో పాల్గొనండి.
ఈ వీడియో చూశారా? 3000 హార్స్ పవర్ కార్ గాల్లోకి ఎగిరిపోతే..
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/XK3jWvNIqK4?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








