గుజరాత్ రాష్ట్రంలో త్వరలో ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం!
భారత ప్రధానిగా పగ్గాలు చేపట్టిన నరేంద్ర మోడీ స్వస్థలం గుజరాత్, ఇప్పటికే అభివృద్ధి చెందిన రాష్ట్రంగా యావత్ దేశానికి ఉదాహరణగా నిలుస్తున్న సంగతి తెలిసినదే. సహజసిద్ధంగా లభించే ప్రత్యామ్నాయ వనరులను చక్కగా సద్వినియోగం చేసుకుంటున్న గుజరాత్, తాజాగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రయోగ పూర్వకంగా నడపాలని భావిస్తోంది.
ఈ మేరకు గుజరాత్ పవర్ కార్పోరేషన్ లిమిటెడ్ (జిపిసిఎల్) ఎలక్ట్రిక్ బస్సు ప్రాజెక్టులో పాల్గొనేందుకు ఆసక్తి ఉన్న పటిష్ట కంపెనీలను ఆహ్వానిస్తోంది. దీనికి సంబంధించి జిపిసిఎల్ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటన కూడా చేశారు.

ప్రజా రవాణా ప్రయోజనార్థం పైలట్ ప్రాతిపదికన ఈ-వెహికల్ ప్రాజెక్టును పరిచయం చేసేందుకు జిపిసిఎల్ సిద్ధంగా ఉందని, ప్రారంభ దశలో భాగంగా, 15 నుంచి 20 ఈ-బస్సులను ప్రవేశపెడతామని ఈ ప్రాజెక్టుతో సంబంధం ఉన్న ఓ ప్రభుత్వాదికారి వెల్లడించారు.
విద్యుత్‌తో నడిచే వాహనాలు, సౌరశక్తిని ఆధారిత విద్యుత్ చార్జింగ్ సిస్టమ్‌లను తమ మాజీ ముఖ్యమంత్రి మరియు ప్రస్తుత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యొక్క పర్యావరణ సానుకూల ప్రణాళికను స్ఫూర్తి పొంది రూపొందించబడ్డాయని జిపిసిఎల్ అధికారి తెలిపారు.
సాంప్రదాయ శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాలు కలిగించే కాలుష్యాన్ని తగ్గించి, పర్యవరణానికి కాస్తయినా మేలు చేకూర్చాలనే ఉద్దేశ్యంతో ఈ పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టామని, మొదటి దశలో భాగంగా ఈ ఎలక్ట్రిక్ బస్సులను గాంధీనగర్ నుంచి అహ్మదాబాద్ వరకు ప్రవేశపెడతామని సదరు అధికారి చెప్పారు.

ఈ ప్రాజెక్ట్ విజయవంతమైతే, దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా దీనిని అమలు చేయనున్నారు. ఇందులో భాగంగా, గాంధీనగర్‌లో ఉపయోగించే సాధారణ సిటీ బస్సుల మాదిరిగానే 15-40 సీట్ల సామర్థ్యం కలిగిన మినీ ఎలక్ట్రిక్ బస్సులను ఈ రూట్లో ప్రవేశపెడుతారు. ఇదే సోలార్ చార్జింగ్ స్టేషన్లను కూడా ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. అంటే, బెంగుళూరు తరహాలోనే త్వరలో గుజరాత్‌లో కూడా ఎలక్ట్రి బస్సులు సందడి చేయనున్నాయన్నమాట.


Click it and Unblock the Notifications








