అక్టోబర్ 13 నుంచి నాల్గవ సీజన్ నేషనల్ జాగ్రఫీ సూపర్‌కార్స్ షో
కార్ ప్రియుల కోసం ప్రముఖ నేషనల్ జాగ్రఫీ టెలివిజన్ ఓ సరికొత్త సూపర్‌కార్స్ షోతో మీ ముందుకు రాబోతుంది. అక్టోబర్ 13, 2014వ తేదీ నుంచి నేషనల్ జాగ్రఫీ ఛానెల్‌లో నాల్గవ సీజన్ సూపర్‌కార్స్ షో ప్రారంభం కానుంది.
సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 10.30 నిమిషాలకు ఈ షో ప్రసారం కానుంది. ఈ షోకి వ్యాఖ్యాతగా లీ రెహెర్‌మ్యాన్ వ్యవహరించనున్నారు. ఛాలెంజింగ్ ప్రొఫెషనల్ రేసర్స్ టానెర్ ఫౌస్ట్, పౌల్ ట్రాసీలు వివిధ సూపర్‌కార్లను డ్రైవ్ చేసి, వాటి శక్తి సామర్థ్యాల గురించి వివరించనున్నారు.

ఈ ఏడాది 4వ సీజన్ సూపర్‌కార్స్ షోలో ప్రముఖ సూపర్‌మోడల్ లీసా హేడన్ ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నారు. ప్రేక్షకులు సూపర్‌కార్ అందాలకు తోడు ఈమె అందాలను కూడా వీక్షించవచ్చు.
నాట్ జియో సూపర్‌కార్స్ షోలో బిఎమ్‌డబ్ల్యూ ఎమ్3, లెక్సస్ ఐఎస్ఎఫ్, పోర్షే 911, నిస్సాన్ జిటిఆర్, టెక్నోక్రాఫ్ట్ లాంబోర్గినీ, జాయ్‌రైడ్ ఫోర్డ్ జిటి, ఫెరారీ ఎఫ్430 స్కుడెరియా, ఫెరారీ కాలిఫోర్నియా, మెర్సిడెస్ ఈ63 ఏఎమ్‌జి, కాడిలాక్ సిటిఎస్‌వి మొదలైన అనేక సూపర్‌కార్లను వాటిని ఇతర సూపర్‌కార్లతో పోల్చడాన్ని మనం ఈ షో ద్వారా వీక్షించవచ్చు.

మరి మర్చిపోకుండా నేషనల్ జాగ్రఫీ ఛానెల్‌లో సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 10.30 నిమిషాలకు ప్రసారమయ్యే ఈ షోని మీరు కూడా వీక్షిస్తారు కదా..!


Click it and Unblock the Notifications








