వీడియో: 2015 ఫోక్స్‌వ్యాగన్ జెట్టా టెలివిజన్ కమర్షియల్
జర్మనీకి చెందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ ఫోక్స్‌వ్యాగన్, ఈ ఏడాది ఆగస్ట్ నెలలో 2015 ఫోక్స్‌వ్యాగన్ జెట్టా ప్రీమియం సెడాన్‌ను ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. త్వరలోనే ఈ సరికొత్త 2015 ఫోక్స్‌వ్యాగన్ జెట్టా ప్రీమియం సెడాన్ ఇండియన్ మార్కెట్లో కూడా విడుదల కానుంది. కొత్త జెట్టా ఎక్స్టీరియర్, ఇంటీరియర్‌లలో అనేక మార్పులు చేర్పులు ఉండనున్నాయి.
ఆటోమొబైల్ యాక్ససరీలపై 75 శాతం తగ్గింపు, త్వరపడండి!
కొత్త 2015 ఫోక్స్‌వ్యాగన్ జెట్టాను మార్కెటింగ్ చేసేందుకు కంపెనీ పలు రకాల టెలివిజన్ కమర్షియల్స్‌ను విడుదల చేస్తోంది. తాజాగా.. కంపెనీ మరో సరికొత్త టెలివిజన్ కమర్షియల్‌ను తమ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేసింది. ఓ ఎయిర్ హెస్టెస్ ఈ కొత్త జెట్టా కారులోని ఇంటీరియర్లను ఫ్లైట్ కాక్‌పిట్‌తో పోలుస్తూ, ఇందులోని ఫీచర్లను వివరిస్తూ ఈ కమర్షియల్ సాగిపోతుంది.

కొత్త 2015 ఫోక్స్‌వ్యాగన్ జెట్టా సెడాన్‌ను తొలిసారిగా ఈ ఏడాది ఏప్రిల్ నెలలో జరిగిన 2014 న్యూయార్క్ ఆటో షోలో ప్రదర్శనకు ఉంచారు. పూర్తిగా రీడిజైన్ చేయబడిన ఫ్రంట్ ప్రొఫైల్, కొత్త డిజైన్‌తో కూడిన బంపర్స్, బెటర్ ఏరోడైనమిక్స్‌తో ఇది లభ్యం కానుంది. దీని రియర్ డిజైన్‌లో కూడా చెప్పుకోదగిన మార్పులు ఉన్నాయి.
కొత్త జెట్టా సెడాన్‌లో రియర్ ట్రాఫిక్ అలెర్ట్‌తో కూడిన బ్లైండ్ స్పాట్ డిటెక్షన్ సిస్టమ్ అనే సేఫ్టీ ఫీచర్‌ను పరిచయం చేయనున్నారు. ఇది పెట్రోల్, డీజిల్ ఇంజన్ ఆప్షన్లతో విభిన్న ట్యూనింగ్‌లలో లభ్యం కానుంది. పెట్రోల్ వెర్షన్ 1.4 లీటర్ టిఎస్ఐ ఇంజన్ 125 హెచ్‌పి, 150 హెచ్‌పి ట్యూనింగ్‌లలో లభిస్తుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్‌తో లభిస్తుంది.
డీజిల్ వెర్షన్ 2015 జెట్టా 2.0 లీటర్ టిడిఐ ఇంజన్‌తో 110 హెచ్‌పి, 150 హెచ్‌పి ట్యూనింగ్‌తో లభిస్తుంది. ఇందులో 110 హెచ్‌పి వెర్షన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 7-స్పీడ్ డిఎస్‌జి ఆటోమేటిక్‌తో లభ్యం కానుంది. ఇకపోతే 150 హెచ్‌పి వెర్షన్ 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా 6-స్పీడ్ డిఎస్‌జి ట్రాన్సిమిషన్‌తో లభిస్తుంది. మరి కొత్త జెట్టా కమర్షియల్‌ను మనం కూడా చూసేద్దాం రండి.
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/9HMdE_vok_c?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








