ఇకనుంచి అన్ని కొత్త కార్లకు ఇండియాలోనే క్రాష్ టెస్ట్స్
ఇప్పటి వరకు అమెరికా, యూరప్ వంటి దేశాల్లో మాత్రమే ఉన్న వెహికల్ క్రాష్ టెస్ట్ సౌకర్యం ఇక ఇండియాలో కూడా అందుబాటులోకి రానుంది. వాహన ఉత్పత్తి సంస్థలు తయారు చేసిన వాహనాల నాణ్యతను పరీక్షించి, సేఫ్టీ విషయంలో ఇది సదరు వాహనం నడిపే డ్రైవర్‌కు మరియు అందులోని ప్రయాణీకులకు ఎంత మేరకు సేఫ్టీని అందిస్తునే అంశాన్ని ఈ క్రాష్ టెస్టుల ద్వారా పర్యవేక్షించి, దానికి అనుగుణంగా కార్లకు రేటింగ్ ఇవ్వటం జరుగుతుంది.
టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొన్న సమాచారం ప్రకారం, త్వరలోనే ఈ తరహా వ్యవస్థ భారతదేశంలో కూడా ఏర్పాటు కానుంది. ఇదే గనుక జరిగితే భారతదేశంలో ఉత్పత్తి అయ్యే అన్ని రకాల కొత్త కార్లకు క్రాష్ టెస్ట్ లను నిర్వహించటం తప్పనిసరి కానుంది. నేషనల్ ఆటోమేటివ్ టెస్టింగ్ అండ్ ఆర్ అండ్ డి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్ (నాట్రిప్) క్రాష్ టెస్టులను నిర్వహించేందుకు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ప్యాసివ్ సేఫ్టీ ఆధ్వర్యంలో గార్క్-చెన్నై వద్ద ఇప్పటికే ఓ కొత్త ఫెసిలిటీని ఏర్పాటు చేసేందుకు స్ననాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ (ఐక్యాట్) మరియు ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్ఏఐ)ల వద్ద కూడా మరో రెండు ఫెసిలిటీలను ఏర్పాటు చేసే అవకాశం ఉంది. చెన్నైలో ఏర్పాటు చేయనున్న ఫెసిలిటీలో ఫ్రంటర్ కార్ టూ కార్ క్రాష్ టెస్ట్, స్లెడ్ టెస్ట్స్, ఫుల్ వెహికల్ క్రాష్ టెస్ట్ మరియు యాంగ్యులర్ కార్ టూ కార్ క్రాష్ టెస్ట్ లను నిర్వహించే సామర్థ్యం ఉంటుంది. ఇందులో ఓ లోడ్ సెల్ వాల్‌తో ఇంపాక్ట్ బీమ్‌పై పడే లోడ్‌లను కూడా కొలిచే సౌకర్యం ఉంటుంది.
యూరోఎన్‌సిఏపి మరియు యూఎస్ఏఎన్‌సిఏపిల మాదిరిగానే ఈ చెన్నై యూనిట్ క్రాష్ టెస్టులను నిర్వహించి, వాటిని చిత్రీకరించనుంది. న్యూ కార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (ఎన్‌సిఏపి) కోసం పరిమితులను నిర్ణయించేందుకు గాను భారత ప్రభుత్వం ఇతర మంత్రిత్వ శాఖలతోను మరియు భారతీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్)తోను సంప్రదింపులు జరుపుతోంది. అంతా సవ్యంగా సాగితే, ఇకపై భారత్‌లో లోపపూరితమైన, నాణ్యతలేని కార్ల తయారీకి చెక్ పడే అవకాశం ఉంది. ఇది జరగటానికి మరో 18 నెలల సమయం పట్టవచ్చని అంచనా.


Click it and Unblock the Notifications








