మారుతి సుజుకి నుంచి మరో కొత్త ఆల్టో మోడల్ వస్తుందట!

దేశపు అగ్రగామి ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇండియా తమ వరల్డ్స్ బెస్ట్ సెల్లింగ్ కార్ ఆల్టోను ఎప్పటికీ అగ్రగామిగానే ఉంచేందుకు సన్నాహాలు చేస్తుంది. ఆల్టో బ్రాండ్‌లో మారుతి ఇప్పటికే కొత్త ఆల్టో 800 మరియు ఆల్టో కె10 మోడళ్లను విక్రయిస్తున్న సంగతి తెలిసినదే. కాగా.. తాజాగా ఆల్టో బ్రాండ్‌లో మరో కొత్త మోడల్‌ను మారుతి సుజుకి అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం.

ప్రస్తుతం మారుతి సుజుకి విక్రయిస్తున్న ఆల్టో 800, ఆల్టో కె10 మోడళ్లకు మధ్యలో ఓ కొత్త ఆల్టో కారును కంపెనీ ప్రవేశపెట్టనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆల్టో కె10 నుంచి గ్రహించిన 1.0 లీటర్ (1000సీసీ) ఇంజన్‌తో ఆ మోడల్ కన్నా కొన్ని తక్కువ ఫీచర్లు ఉండేలా ఈ కొత్త ఆల్టో మోడల్‌‍ను తయారు చేయనున్నారట. ఫలితంగా ఈ కొత్త ఆల్టో మోడల్ ధర ఆల్టో కె10 కన్నా తక్కువగా ఉండనుంది.

New Maruti Alto

కొత్త ఆల్టో మోడల్‌లో రివైజ్డ్ హెడ్‌ల్యాంప్స్, టెయిల్ ల్యాంప్, బాడీ గ్రాఫిక్స్, అప్‌డేటెడ్ ఇంటీరియర్స్ వంటి కాస్మోటిక్ మార్పులు ఉండే అవకాశం ఉంది. ఇందులో ఉపయోగించనున్న 1 లీటర్, కె10, 4-సిలిండర్, 16-వాల్వ్ ఇంజన్ గరిష్టంగా 6200 ఆర్‌పిఎమ్ వద్ద 68 హార్స్ పవర్‌ల శక్తిని, 3500 ఆర్‌పిఎమ్ వద్ద 90 న్యూటన్ మీటర్ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

ఇకపోతే ఆల్టో కె10 మోడల్‌లో కూడా ఏఎమ్‌టి (ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్) టెక్నాలజీతో కూడిన గేర్‌బాక్స్‌ను పరిచయం చేయాలని కంపెనీ యోచిస్తోంది. ఆల్టో బ్రాండ్‌లో ఎక్కువ వేరియంట్లను ప్రవేశపెట్టడం ద్వారా కస్టమర్ల ఛాయిస్‌కు తగినట్లుగా కంపెనీ ఈ మోడల్‌ను ఆఫర్ చేసే అవకాశం ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Thursday, May 29, 2014, 15:02 [IST]
English summary
Rumour has it that Maruti Suzuki will introduce a new Alto model that will be placed between the original Alto and the Alto K10.The said new model would be powered by the K10's 1.0-litre engine, but will have fewer features and thus, will cost less. It will be differentiated by a few cosmetic changes such as revised headlamp, taillamps, body graphics, along with an updated interior.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+