సెప్టెంబర్ 10, 2014న సరికొత్త స్కొడా యెటి ఫేస్‌లిఫ్ట్ విడుదల

By Ravi

చెక్ రిపబ్లికన్ కార్ మేకర్ స్కొడా ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించిన 2014 యెటి ఎస్‌యూవీ విడుదలకు ముహుర్తం ఖరారైంది. ఈనెల 10వ తేదీన స్కొడా తమ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ యెటి ఎస్‌యూవీని భారత్‌లో విడుదల చేయనుంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లలో విడుదలైన ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ మంచి ప్రశంసలను అందుకుంది.

ఈ నేపథ్యంలో, కొత్త 2014 స్కొడా యెటి భారత మార్కెట్లో కూడా మంచి సక్సెస్‌ను సాధించవచ్చనే అంచనాలు నెలకొన్నాయి. వాస్తవానికి, భారత మార్కెట్లో స్కొడా యెటి విడుదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ మోడల్‌లో పూర్తిస్థాయి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ రాలేదు. కాబట్టి, కొత్తగా రానున్న ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌పై ఇప్పటికే మార్కెట్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.


కొత్త స్కొడా యెటి రెండు ఇంజన్ ఆప్షన్లలో లభ్యం కానున్నట్లు సమాచారం. టూ-వీల్ డ్రైవ్ (4x2) ఆప్షన్ కలిగిన స్కొడా యెటిలో 2.0 లీటర్ డీజిల్ ఇంజన్‌ను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ 110 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

ఇకపోతే, ఫోర్-వీల్ డ్రైవ్ (4x4) ఆప్షన్ కలిగిన స్కొడా యెటిలో కూడా 2.0 లీటర్ డీజిల్ ఇంజన్‌నే ఉపయోగించనున్నారు. అయుతే, ఈ ఇంజన్ గరిష్టంగా 140 పిఎస్‌ల శక్తిని ఉత్పత్తి చేస్తుంది. కానీ 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్సిమిషన్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.

ప్రస్తుతానికి స్కొడా యెటి ఆటోమేటిక్ వేరియంట్‌కు సంబంధించి ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు. స్కొడా యెటి 110 పిఎస్, 4x2 వెర్షన్ ధర రూ.15 లక్షలు, స్కొడా యెటి 140 పిఎస్, 4x4 వెర్షన్ ధర రూ.19 లక్షలు ఉండొచ్చని అంచనా.

Yeti 2014

సరికొత్త డిజైన్, అధునాతన ఫీచర్లు, మోడ్రన్ టెక్నాలజీ మరియు విలాసవంతమైన కంఫర్టీ ఫీచర్లతో కొత్త స్కాడా యెటిని అప్‌గ్రేడ్ చేశారు. కొత్త 2014 స్కొడా యెటి రిఫ్రెష్డ్ డిజైన్‌తో సరికొత్త లుక్‌ను కలిగి ఉంటుంది. ముందు వైపు కొత్త బంపర్, కొత్త గ్రిల్, కొత్త బ్యాడ్జ్‌లతో చాలా నీట్‌గా కనిపిస్తుంది.

అలాగే, వెనుక డిజైన్‌ను గమనిస్తే, C ఆకారంలో ఉండే టెయిల్ ల్యాంప్స్ ఇందులో ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి. బాడీ కలర్డ్ బంపర్స్, సరికొత్త డిజైన్‌తో కూడిన అల్లాయ్ వీల్స్ మరొక ప్రత్యేకత. దీని ఇంటీరియర్లలో కూడా అనేక మార్పులు చేర్పులు ఉండనున్నాయి. 2014 స్కొడా యెతి ఎస్‌యూవీకి సంబంధించి ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూనే ఉండండి.

More from DriveSpark

Article Published On: Saturday, September 6, 2014, 13:05 [IST]
English summary
The 2014 Skoda Yeti had been showcased at 2014 Auto Expo, which was held in Delhi. The Czech manufacturer has now confirmed to launch its refreshed vehicle on 10th September, 2014. They have recently revamped their entire model portfolio and now its the Yeti's turn.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+