వచ్చే ఆటో ఎక్స్‌పోలో 2016 టొయోటా ఎతియోస్ లాంచ్
జపనీస్ కార్ కంపెనీ టొయోటా అందిస్తున్న ఎతియోస్ సెడాన్ మరో రెండేళ్లలో కొత్త ముఖంతో కనిపించనుంది. టొయోటా తమ ఎతియోస్ సెడాన్‌ను అప్‌గ్రేడ్ చేసే ప్రయయత్నం చేస్తోంది. ఎతియోస్ భారత్‌లో విడుదలై దాదాపు మూడేళ్లు కావస్తోంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ మోడల్‌లో పూర్తి ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ రాలేదు.
భారతీయ కస్టమర్లకు ఎతియోస్ డిజైన్ బోర్ కొట్టడంతో, ఈ మోడల్‌ను కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా క్రమంగా తగ్గుతోంది. పైపెచ్చు ఈ కారును ఎక్కువగా టాక్సీగా వినియోగిస్తుండటం కూడా దీని అమ్మకాలు తగ్గుముఖం పట్టడానికి మరో కారణంగా చెప్పుకోవచ్చు. ఈ కారణంగా, వ్యక్తిగత ప్రయోజనం కోసం ఎతియోస్‌ని కొనేవారి సంఖ్య తగ్గుతోంది.

ఈ పరిస్థితులను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన టొయోటా, ఇప్పుడు తమ ఎతియోస్‌లో ఓ తర్వాతి తరం (నెక్స్ట్ జనరేషన్) మోడల్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న ఎతియోస్ కన్నా ఎన్నో రెట్లు మెరుగైన డిజైన్, టెక్నాలజీ, ఫీచర్లతో కూడిన నెక్స్ట్ జనరేషన్ ఎతియోస్‌ను టొయోటా అభివృద్ధి చేయనుంది.
మరికొద్ది రోజుల్లో టొయోటా విడుదల చేయనున్న సరికొత్త 2014 కరోలా ఆల్టిస్ డిజైన్ నుంచి స్ఫూర్తి పొంది కొత్త ఎతియోస్‌ను అభివృద్ధి చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అంటే, కొత్త ఎతియోస్ షార్పర్ అండ్ స్పోర్టీయర్ లుక్‌ని కలిగి ఉంటుందని తెలుస్తోంది.

నెక్స్ట్ జనరేషన్ టొయోటా ఎతియోస్‌లో డేటైమ్ రన్నింగ్ లైట్స్, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ వంటి మోడ్రన్ డిజైన్ ఎలిమెంట్స్ కూడా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం టొయోటా తమ నెక్స్ట్ జనరేషన్ ఎతియోస్‌ను అభివృద్ధి చేసేందుకు కస్టమర్ల నుంచి ఫీడ్‌బ్యాక్ సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఫీడ్‌బ్యాక్ ఆధారంగా చేసుకొని కొత్త ఎతియోస్‌లో అనేక మార్పులు చేర్పులు చేసే అవకాశాలున్నాయి.
టొయోటా తమ నెక్స్ట్ జనరేషన్ ఎతియోస్ సెడాన్‌ను 2016లో జరగబోయే ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించనుంది.


Click it and Unblock the Notifications








