ఫోర్డ్ ఇండియా యాజమాన్యంలో మార్పు!

By Ravi

అమెరికాకు చెందిన ప్రముఖ కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ మోటార్స్ యొక్క పూర్తి 100 శాతం భారతీయ అనుబంధ సంస్థ ఫోర్డ్ ఇండియాలో యాజమాన్య మార్పులు చోటు చేసుకున్నాయి. ఫోర్డ్ ఆసియా పసిఫిక్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ సర్వీస్) నీగెల్ హ్యారిస్‌ను ఫోర్డ్ ఇండియా అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈయన నియామకం ఫిబ్రవరి 1, 2014 నుంచి అమల్లోకి రానుంది.

ప్రస్తుతం ఫోర్డ్ ఇండియా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జోగీందర్ సింగ్ స్థానంలో నీహెల్ హ్యారిస్ బాధ్యతలు తీసుకోనున్నారు. కాగా.. జోగీందర్ సింగ్‌ను ఫోర్డ్ మోటార్ కంపెనీ కార్పోరేట్ స్ట్రాటజీ డైరెక్టర్‌గా కొత్త బాధ్యతలు కేటాయించనున్నట్లు కంపెనీ పేర్కొంది.

Nigel Harris

హ్యారిస్ 1985లో న్యూజిలాండ్‌లో ఫోర్డ్ కంపెనీలో సేల్స్ అనలిస్ట్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత యూరప్, ఆఫ్రికా మరియు ఆసియా పసిఫిక్ దేశాల్లో పలు హోదాల్లో పనిచేశారు. భారతీయ కార్యకలాపాల్లో కూడా ఆయన చాలా కాలంగా భాగం పంచుకున్నారు.

ఇకపోతే ప్రస్తుత ఫోర్డ్ ఇండియా ప్రెసిడెంట్ జోగీందర్ సింగ్ అమెరికాకు వెళ్లి, ఫోర్డ్ మోటార్క్ కంపెనీలో మార్చ్ 1, 2014వ తేది నుంచి తన కొత్త కార్పోరేట్ బాధ్యతను స్వీకరించనున్నారు. ఈయన ఫోర్డ్ ఇండియా ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టక మునుపు, చెన్నై హెడ్‌క్వార్టర్స్‌గా ఉన్న ఫోర్డ్ బిజినెస్ సర్వీస్ సెంటర్ (రెస్పాన్సిబల్ ఫర్ ఫోర్డ్ గ్లోబల్ బిజినెస్ సర్వీస్ ఆపరేషన్స్)కు ప్రెసిడెంట్, మేనేజింగ్ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు.

More from DriveSpark

Article Published On: Friday, January 31, 2014, 10:53 [IST]
English summary
Ford Motor Company has announced that Nigel Harris, vice president sales and service, Ford Asia Pacific, has been appointed as president, Ford India effective February, 1, 2014. Harris succeeds Joginder Singh who has been assigned a new role of Director, Corporate Strategy, Ford Motor Company.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+