ఢిల్లీ ఆటో ఎక్స్‌పో 2014లో నిస్సాన్ ఇవాలియా ఫేస్‌లిఫ్ట్
కస్టమర్లను ఆకట్టుకోవటంలో విఫలమైన నిస్సాన్ ఇవాలియా ఎమ్‌పివి విషయంలో కంపెనీ నిరుత్సాహం చెందకుండా, ఈ మోడల్‌ను ఎలాగైన కస్టమర్లకు చేరువ చేయాలనే లక్ష్యంతో ఇందులో మరోసారి ఫేస్‌లిఫ్ట్‌ను ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తుంది. నిస్సాన్ ఇవాలియా గ్లోబల్ మార్కెట్లలో ఎన్‌వి200 పేరిట అమ్ముడవుతోంది. అక్కడి మార్కెట్లో ఇది ప్యాసింజర్, కమర్షియల్ సెగ్మెంట్లో మంచి సక్సెస్‌ను సాధించింది. కానీ ఇండియాలో మాత్రం ఆశించిన సక్సెస్‌ను సాధించలేకపోయింది.
నిస్సాన్ ఇండియా గడచిన 2012లో జరిగిన ఆటో ఎక్స్‌పోలో నిస్సాన్ ఇవాలియా ఎమ్‌పివిని ఆవిష్కరించింది, ఆ తర్వాత 2012 చివర్లో ఈ మోడల్‌ను భారత మార్కెట్లో వాణిజ్య పరంగా విడుదల చేసింది. మొదట్లో అమ్మకాలు ఫర్వాలేదనిపించినా, ఆ తర్వాత అవి క్రమంగా తగ్గుముఖం పట్టాయి. అమ్మకాలను పెంచుకునేందుకు గడచిన సంవత్సరం అక్టోబర్ నెలలో కంపెనీ సైలెంట్‌గా ఓ ఫేస్‌లిఫ్టెడ్ వెర్షన్ ఇవాలియా ఎమ్‌పివిని మార్కెట్లో విడుదల చేసినప్పటికీ ప్రయోజనం మాత్రం శూన్యం.

ఈ పరిస్థితుల నేపథ్యంలో, కస్టమర్ల అభిరుచికి తగినట్లుగా ఇవాలియాను అప్‌గ్రేడ్ చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. అక్టోబర్ 2013లో విడుదల చేసిన ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ నిస్సాన్ ఇవాలియాలో రెండవ వరుసలో కెప్టెన్ సీట్స్, స్లైడింగ్ మిడిల్-రో విండో, 15-ఇంచ్ అల్లాయ్ వీల్స్ (ఇదివరకు 14 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఉపయోగించే వారు), రియర్ వైపర్ అండ్ వాషర్ వంటి మార్పులు చేర్పులు చేసారు కాగా.. ఈ ఏడాది ఆటో ఎక్స్‌పోలో విడుదల కానున్న కొత్త 2014 నిస్సాన్ ఇవాలియాలో కొత్త డిజైన్‌తో పాటుగా సరికొత్త మార్పులు ఉండే అవకాశం కనిపిస్తోంది.
అయితే, ఈ కొత్త 2014 నిస్సాన్ ఇవాలియా ఎమ్‌పివిలో యాంత్రికపరమైన మార్పులు ఉండబోవని తెలుస్తోంది. ప్రస్తుత నిస్సాన్ ఇవాలియాలో ఉపయోగించిన అదే 1.5 లీటర్ డిసిఐ కె9కె డీజిల్ ఇంజన్‌నే కొత్త ఇవాలియాలోను ఉపయోగించనున్నారు. ఈ ఇంజన్ గరిష్టంగా 85 బిహెచ్‍పిల శక్తిని, 200ఎన్ఎమ్‌ల టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేయబడి ఉంటుంది.


Click it and Unblock the Notifications








