నిస్సాన్ ఇండియా కొత్త మేనేజింగ్ డైరెక్టర్‌గా అరుణ్ మల్‌హోత్రా

నిస్సాన్ ఇండియా సీనియర్ మేనేజ్‌మెంట్‌లో మార్పులు చోటు చేసుకున్నాయి. తమ కొత్త మేనేజింగ్ డైరెక్టర్‌గా అరుణ్ మల్‌హోత్రాను నియమించుకుంటున్నట్లు నిస్సాన్ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఓ ప్రకటనలో పేర్కొంది. కొత్తగా ఎన్నికైన ఎమ్‌డి అరుణ్ మల్‌హోత్రా నిస్సాన్ ఇండియా ఆపరేషన్స్ ప్రెసిడెంట్ గుయ్‌ల్లామ్ సికార్డ్‌కు రిపోర్టింగ్ చేయనున్నారు. ముంబైలోని నిస్సాన్ సేల్స్ అండ్ మార్కెటింగ్ హెడ్‌క్వార్టర్స్‌లో ఆయన విధులు నిర్వహించనున్నారు.

నిస్సాన్ ఓవరాల్ పెర్ఫార్మెన్స్‌ను పెంచడం, కొత్త ఉత్పత్తుల పరిచయాన్ని నిర్వహించడం, నిరంత నెట్‌వర్క్ విస్తరణ ద్వారా నిస్సాన్ అండ్ డాట్సన్ బ్రాండ్లను విస్తృతిని మరియు లభ్యతను విస్తరించడం వంటి కీలక వ్యాపార విభాగాలకు అరుణ్ మల్‌హోత్రా బాధ్యతలు స్వీకరించనున్నారు. నిస్సాన్‌లో చేరడానికి ముందుగా అరుణ్ మల్‌హోత్రా, మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ అండ్ ఫార్మ్ సెక్టార్‌లోని ఇంటర్నేషనల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగానికి హెడ్‌గా పనిచేశారు.

ఆటోమొబైల్ పరిశ్రమలో దాదాపు 30 ఏళ్ల అనుభవం పొందిన అరుణ్ మల్‌హోత్రా సేల్స్, సర్వీస్, నెట్‌వర్క్ విస్తరణ, అభివృద్ధి, బ్రాండ్ నిర్మాణం, వినియోగదారుని సాన్నిహిత్య ప్రణాళికలు రూపొందించడం వంటి వాటిలో మంచి ట్రాక్ రికార్డును కలిగి ఉన్నారని నిస్సాన్ తెలిపింది. గతంలో ఈయన బజాజ్ ఆటో, మారుతి సుజుకి వంటి కంపెనీలలో పనిచేసిన అనుభం కూడా ఉంది. అరుణ్ మల్‌హోత్రా మెకానికల్ ఇంజనీరింగ్‌లో బిఈ మరియు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్, కోల్‌కటాలో ఏఎమ్‌బిఏ పూర్తి చేశారు.

More from DriveSpark

Article Published On: Thursday, October 9, 2014, 17:19 [IST]
English summary
Nissan has announced the appointment of Arun Malhotra as the new Managing Director for Nissan Motor India Pvt. Ltd. Malhotra will report to Guillaume Sicard, President – Nissan India Operations. He will be based in Nissan’s Sales & Marketing headquarters in Mumbai.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+