2014 సావ్ పాలో మోటార్ షో: నిస్సాన్ కిక్స్ కాన్సెప్ట్ ఆవిష్కరణ
జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ బ్రెజిల్‌లో జరుగుతున్న 28వ సావ్ పాలో అంతర్జాతీయ మోటార్ షోలో ఓ సరికొత్త కాన్సెప్ట్ క్రాసోవర్‌ను ఆవిష్కరించింది. ఈ కాంపాక్ట్ క్రాసోవర్ కాన్సెప్ట్ పేరు 'నిస్సాన్ కిక్స్' (Nissan Kicks). బ్రెజిల్ నగరం నుంచి స్ఫూర్తి పొంది ఈ కాన్సెప్ట్ వాహనాన్ని డిజైన్ చేశామని నిస్సాన్ పేర్కొంది.
నిస్సాన్ కిక్స్ కాన్సెప్ట్ ఓ గ్లోబల్ కొల్లాబరేషన్ ప్రోడక్ట్ అని, కానీ దీనిని బ్రెజిల్ వీధుల నుంచి స్ఫూర్తి పొంది, అక్కడి ప్రజల కోసం డిజైన్ చేయబడినదని నిస్సాన్ గ్లోబల్ డిజైన్ స్ట్రాటజీ డిపార్ట్‌మెంట్ ఎగ్జిక్యూటివ్ డిజైన్ డైరెక్టర్ మమోరు ఓవోకి తెలిపారు. నిస్సాన్ కిక్స్ కాన్సెప్ట్ క్రాసోవర్‌కు సంబంధించిన మరింత సమాచారాన్ని ఈ కథనంలో తెలుసుకోండి.
మరింత సమాచారం తర్వాతి సెక్షన్‌లో.. మరిన్ని వివరాలను ఈ ఫొటో ఫీచర్‌లో పరిశీలించండి..!

తర్వాతి స్లైడ్‌లలో నిస్సాన్ కిక్స్ కాంపాక్ట్ క్రాసోవర్ కాన్సెప్ట్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను తెలుసుకోండి.

జపాన్‌లోని నిస్సాన్ గ్లోబర్ డిజైన్ సెంటర్ నాయకత్వంలో, శాన్ డీగోలోని నిస్సాన్ డిజైన్ అమెరికా విభాగం ఇటీవలే ప్రారంభించిన నిస్సాన్ డిజైన్ అమెరికా రియా నుంచి గ్రహించిన ఇన్‌పుట్స్ ఆధారంగా ఈ కిక్స్ కాంపాక్ట్ క్రాసోవర్ కాన్సెప్ట్‌ను డిజైన్ చేసింది.

బ్రెజిల్ రోడ్లపై ప్రధానంగా కనిపించే సిల్వర్, బ్లాక్ అండ్ వైట్ కలర్ కార్లను పరిశీలించిన నిస్సాన్ బృందం, ఆయా వాహనాల మధ్య అంతరాన్ని చూసిందని, అందుకే ఈ సరికొత్త అర్బన్ కాన్సెప్ట్ వాహనాన్ని డిజైన్ చేశామని కంపెనీ తెలిపింది.

ఈ అంతరాన్ని భర్తీ చేయాలనే ఉద్దేశ్యంతోనే నిస్సాన్ కిక్స్ కాన్సెప్ట్‌ను అభివృద్ధి చేశామని, ఇది నిస్సాన్ కార్ల యొక్క డిజైన్ సిగ్నేచర్‌ను ప్రతిభింభింపజేస్తుందని కంపెనీ పేర్కొంది.

నిస్సాన్ కిక్స్‌ను డ్యూయెల్ పర్పస్ కోసం తయారు చేశామని, ఇది ఇటు కార్యసాధక అవసరాలను తీర్చడమే కాకుండా అటు స్టైల్‌ని ఆఫర్ చేస్తుందని, ప్రస్తుతం మార్కెట్లో మంచి స్టైలిష్ కార్లు లేవని తాము భావించినందుకే దీనిని తయారు చేశామని నిస్సాన్ డిజైన్ అమెరికా ప్రాజెక్ట్ లీడ్ డిజైనర్ హీరెన్ పాటెల్ తెలిపారు.

నిస్సాన్ తమ కిక్స్ కాంపాక్ట్ క్రాసోవర్ అర్బన్ కాన్సెప్ట్‌కు సంబంధించిన ఇతర సాంకేతిక వివరాలను మాత్రం వెల్లడి చేయలేదు. నిస్సాన్ కిక్స్ కాంపాక్ట్ క్రాసోవర్ ప్రస్తుతానికి కాన్సెప్ట్ వెర్షన్ మాత్రమే అని తెలుస్తోంది. ఇందులో ప్రొడక్షన్ వెర్షన్ ప్లాన్స్ గురించి కంపెనీ పెదవి విప్పలేదు.

సావ్ పాలో అంతర్జాతీయ మోటార్ షో ప్రతి రెండేళ్లకు ఒకసారి చొప్పున జరుగుతుంది. ఇది లాటిన్ అమెరికాలో కెల్లా అతిపెద్ద ఆటో షో. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 9, 2014 వరకు జరగనున్న 28వ సావ్ పాలో మోటార్ షోలో నిస్సాన్ కిక్స్ కాన్సెప్ట్‌ను ప్రదర్శించనున్నారు.
వీడియో
నిస్సాన్ కిక్స్ కాన్సెప్ట్ గురించి తయారు చేసిన వీడియోని ఈ స్లైడ్‌లో చూడొచ్చు.


Click it and Unblock the Notifications








