బెస్ట్ గ్లోబల్ బ్రాండ్స్ 2014 జాబితాలో నిస్సాన్
జపనీస్ కార్ బ్రాండ్ నిస్సాన్ మరో అరుదైన గుర్తింపును దక్కించుకుంది. ప్రపంచపు అగ్రగామి బ్రాండ్ కన్సల్టెన్సీ ఇంటర్‌బ్రాండ్ ప్రకారం, 2014వ సంవత్సరానికి గాను ప్రపంచపు అత్యంత విలువైన బ్రాండ్‌లలో నిస్సాన్ కూడా ఒకటిగా గుర్తింపు పొందింది.
ఇంటర్‌బ్రాండ్ విడుదల చేసిన ది బెస్ట్ గ్లోబల్ బ్రాండ్ స్టడీలో.. 2014వ సంవత్సరానికి గాను ప్రపంచంలో కెల్లా అత్యంత విలువైన బ్రాండ్ల జాబితాలో నిస్సాన్ 56వ స్థానంలో నిలిచింది. అంతకు ముందు సంవత్సరం (2013) జాబితాలో నిస్సాన్ 65వ స్థానంలో ఉండేది.

నిస్సాన్ ఆర్థిక సామర్థ్యం, ఉత్పత్తుల శ్రేణి, ఎలక్ట్రిక్ వాహనాలలో నాయకత్వ స్థానం తదితర అంశాలను ఈ అధ్యయనం ప్రతిభింభింపజేస్తుంది. గడచిన సంవత్సరనం నిస్సాన్ అంచనా బ్రాండ్ వ్యాల్యూ 6.2 బిలియన్ డాలర్ల కన్నా ఈ ఏడాది అంచనా బ్రాండ్ వ్యాల్యూ 7.623 బిలియన్ డాలర్లుగా ఉండగలదని ఇంటర్‌బ్రాండ్ స్టడీ చెబుతోంది.
గడచిన జూన్ నెలలో ఇంటర్‌బ్రాండ్ నిర్వహించిన బెస్ట్ గ్లోబల్ గ్రీన్ బ్రాండ్స్ రిపోర్ట్‌లో నిస్సాన్ ప్రపంచంలో కెల్లా అత్యుత్తుమ పర్యావరణ సాన్నిహిత్య బ్రాండ్‌గా నిలిచింది. నిస్సాన్ విక్రయిస్తున్న వంద శాతం ఎలక్ట్రిక్ వెహికల్ లీఫ్ సాయంతో కంపెనీ ఈ జాబితాలో మరో అడుగు ముందుకు వెళ్లింది.


Click it and Unblock the Notifications








