భారత మార్కెట్ కోసం నిస్సాన్ చవక ఎలక్ట్రిక్ కార్!

By Ravi

జపనీస్ కార్ నిస్సాన్ భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్ల కోసం ఓ లో కాస్ట్ ఎలక్ట్రిక్ కారును ఆఫర్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతం నిస్సాన్ గ్లోబల్ మార్కెట్లలో తమ లీఫ్ కారును సక్సెస్‌ఫుల్‌గా సేల్ చేస్తోంది. కంపెనీ ఇటీవలే తమ ఇవాలియా ఎమ్‌పివిలో ఓ ఎలక్ట్రిక్ వెర్షన్‌ను పరిచయం చేసింది. అయితే, ఈ ఎలక్ట్రిక్ కంపెనీ పెట్రోల్, డీజిల్ కార్ల కన్నా అధికంగా ఉంటాయి.

కాబట్టి, ఇలాంటి ఖరీదైన ఎలక్ట్రిక్ కార్లు ఇండియాలో అంతగా సక్సెస్ సాధించకపోవచ్చు. అందుకే నిస్సాన్ తమ వ్యూహాన్ని మార్చుకుంది. నిస్సాన్ ప్రస్తుతం భూటాన్‌కు చెందిన ఎలక్ట్రిక్ కార్ కంపెనీ థండర్ మోటార్స్‌తో కలిసి పనిచేస్తోంది. థండర్ మోటార్స్ ఓ లో కాస్ట్ ఎలక్ట్రిక్ కారు టెస్టింగ్‌ను ప్రారంభించింది. ఈ థండర్ మోటార్స్‌కు నిస్సాన్ టెక్నాలజీ మరియు ఆర్ అండ్ డి రూపంలో మద్దతును అందించనుంది.

Nissan Leaf

వాస్తవానికి థండర్ మోటార్స్ అభివృద్ధి చేస్తున్న ఈ ఎలక్ట్రిక్ కారు ప్రత్యేకించి భూటన్ మార్కెట్ కోసమే అయినప్పటికీ, ఇందులో నిస్సాన్ కూడా భాగమై ఉన్న నేపథ్యంలో, ఇండియాలో కూడా ఈ తక్కువ ధర కలిగిన ఎలక్ట్రిక్ కారు విడుదలయ్యే అవకాశాలున్నాయి. భారత్‌లో ఈ లో కాస్ట్ ఎలక్ట్రిక్ కారు ధర రూ.10 లక్షలకు దిగువనే ఉండొచ్చని అంచనా. అయితే, ఈ విషయం గురించి నిస్సాన్ ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

More from DriveSpark

Article Published On: Monday, March 10, 2014, 10:11 [IST]
English summary
Nissan is said to be contemplating the use of the Datsun name plate for the new low cost electric car that it is c0-developing with Bhutanese electric car maker Thunder. The low cost electric car developed thus could be introduced in the Indian market as well, which currently plays host to a lone operators, the Mahindra Reva E2O.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+