నిస్సాన్ క్యాష్‌కాయ్.. పేరును తప్పుగా పిలిస్తే ఏమౌతుంది?
'Nissan Qashqai' ఈ పేరును మీరు ఎలా పిలుస్తారు..? నిస్సాన్ క్వాష్కాయ్ లేక నిస్సాన్ ఖాష్కాయ్..? ఎలా పిలిచినా తప్పే అది ఎందుకో ఈ కథనంలో తెలుసుకుందాం రండి. వాహనాలకు నాలుక మడతపడే పేర్లను పెట్టడంలో జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్‌కు సాటి వేరెవ్వరూ రారనే చెప్పాలి. అలాంటి ఓ టంగ్ ట్విస్టింగ్ పేరే ఇది.
ఈ పేరును చాలా మంది తప్పుగా పలుకుతుంటారు. వాస్తవానికి ఇదొక పురాతన ఆదివాసీ తెగకు సంబంధించిన పేరు దీనిని 'క్యాష్‌కాయ్' (CASH-KAI) అని పలకాలి. నిస్సాన్ తమ క్యాష్‌కాయ్ ఎస్‌యూవీ పేరు గురించి అవగాహన కల్పించేందుకు ఓ విశిష్టమైన క్యాంపైన్‌ను ప్రారంభించింది.
ఇది కూడా చదవండి: నిస్సాన్ క్యాష్‌కాయ్ ఇండియాకు వస్తుందా?
నిస్సాన్ ఓ పాపులర్ కాఫీ షాప్ ఎదుట తమ క్యాష్‌కాయ్ ఎస్‌యూవీని ఉంచి, ప్రజలకు ఉచితంగా కాఫీలను అందజేసింది. అయితే, ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఫ్రీ కాఫీ కావాలంటే వారు తమ పేర్లను చెప్పాలి. ఇలా చెప్పిన పేర్లను తమ కాఫీ కప్పులపై ఓ వైపు కావాలనే తప్పు స్పెల్లింగ్‌తో రాసి వారికి అందజేశారు.
కాఫీ కప్పుకు మరోవైపు నిస్సాన్ క్యాష్‌క్యాయ్ పేరును ముద్రించి, మీ పేరును తప్పుగా పలికారా.. కంగారు పడకండి నిస్సాన్ క్యాష్‌కాయ్‌తో కూడా ఎప్పుడూ ఇలానే జరుగుతూ ఉంటుందని పేర్కొన్నారు. మరి ఆ వీడియోని మనం కూడా చూసేద్దాం రండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/5PjWarNG_pQ?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








