నిస్సాన్, డాట్సన్ సేల్స్ రిపోర్ట్ - ఏప్రిల్ 2014

By Ravi

జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ ఇండియా ఇటీవలే తమ పురాతన బ్రాండ్ డాట్సన్‌ను ఇండియాలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసినదే. డాట్సన్ బ్రాండ్ క్రింద కంపెనీ అందిస్తున్న తొలి మోడల్ డాట్సన్ గో హ్యాచ్‌బ్యాక్ అమ్మకాలు మార్కెట్లో జోరుగానే సాగుతున్నాయి.

డాట్సన్ రాకతో నిస్సాన్ అమ్మకాలు రెట్టింపు అయ్యాయి. ఏప్రిల్ 2013తో పోల్చుకుంటే ఏప్రిల్ 2014లో నిస్సాన్ అమ్మకాలు ఏకంగా 328 శాతం వృద్ధి చెంది 1,239 యూనిట్ల నుంచి 5,301 యూనిట్లకు పెరిగాయని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.


ఏప్రిల్ 2014 మొత్తం అమ్మకాలలో సగానికి పైగా డాట్సన్ బ్రాండ్ అమ్మకాలే ఉన్నాయి. గడచిన నెలలో నిస్సాన్ మొత్తం 2,691 డాట్సన్ గో కార్లను విక్రయించింది. గడచిన ఆర్థిక సంవత్సరంలో నిస్సాన్ ఎగుమతుల విషయంలో మారుతి సుజుకిని అధిగమించి, భారత్‌లో ద్వితీయ అగ్రగామి కార్ కంపెనీగా నిలిచిన సంగతి తెలిసినదే.

నిస్సాన్ మరికొద్ది రోజుల్లో డాట్సన్ గో ప్లస్ కాంపాక్ట్ ఎమ్‌పివి, నిస్సాన్ సన్నీ ఫేస్‌లిఫ్ట్ మరియు నిస్సాన్ ఇవాలియా ఫేస్‌లిఫ్ట్ మోడళ్లను విడుదల చేయనున్న నేపథ్యంలో కంపెనీ అమ్మకాలు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Saturday, May 3, 2014, 14:39 [IST]
English summary
Nissan Group of India, which includes the Nissan and Datsun brands, has shown strong performance in sluggish Market conditions. The group has registered a healthy year-on-year sales indicated by a growth of 328 percent during the month of April 2014.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+