2014 ఢిల్లీ ఆటో ఎక్స్‌పోలో నిస్సాన్ సన్నీ ఫేస్‌లిఫ్ట్!
వచ్చే నెల ఆరంభం నుంచి జరగనున్న 2014 ఇండియన్ ఆటో ఎక్స్‌పో అనేక కొత్త కార్లు, అప్‌గ్రేడెడ్ కార్లకు వేదికగా మారనుంది. జపనీస్ కార్ కంపెనీ నిస్సాన్ ఇండియా, దేశీయ విపణిలో విక్రయిస్తున్న ఫ్లాగ్‌షిప్ సెడాన్ 'నిస్సాన్ సన్నీ' సరికొత్త అవతారంలో కనిపించనుంది. ప్రస్తుతం లభిస్తున్న సన్నీ సెడాన్‌లో కంపెనీ ఓ అప్‌గ్రేడెడ్ వేరియంట్‌ను పరిచయం చేయనున్నట్లు సమాచారం.
కొత్త 2014 నిస్సాన్ సన్నీ సెడాన్ మరింత యూత్‌ఫుల్ డిజైన్‌తో, సరికొత్త ఫీచర్లతో లభ్యం కానుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, కొత్త నిస్సాన్ సన్నీ ఫ్రంట్ డిజైన్‌లో అనేక మార్పులు ఉండనున్నాయి. ఇందులో ప్రధానంగా, కొత్త హెడ్‌ల్యాంప్ డిజైన్, రివైజ్డ్ ఫ్రంట్ గ్రిల్, కొత్త ఫ్రంట్ బంపర్స్‌ను కొత్త 2014 నిస్సాన్ సన్నీ సెడాన్‌లో చూసే అవకాశం ఉంది.

అలాగే, కొత్త సన్నీలో మరిన్ని అదనపు ఫీచర్లతో కూడిన ఎక్స్‌వి ప్రీమియం వేరియంట్‌ను జోడించే ఆస్కారం ఉంది. ఈ ప్రీమియం వేరియంట్‌లో నాలుగు ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లు లభ్యం కానున్నాయి. అయితే, కొత్త సన్నీలో యాంత్రికపరమైన మార్పులు మాత్రం ఉండబోవని తెలుస్తోంది. ప్రస్తుతం ఉపయోగిస్తున్న పెట్రోల్, డీజిల్ ఇంజన్లతో పాటు, 5-స్పీడ్ మ్యాన్యువల్ మరియు సివిటి ట్రాన్సిమిషన్లను యధావిధిగా ఉపయోగించనున్నారు.
మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, కొత్త 2014 సన్నీ సెడాన్ విడుదలతో పాటుగా, ప్రస్తుతం కంపెనీ విక్రయిస్తున్న సన్నీ సెడాన్‌ను అమ్మకాలను కూడా అలానే కొనసాగించాలని కంపెనీ యోచిస్తోంది. అయితే, ఈ పాత వేరియంట్‌ను తక్కువ ధరకే విక్రయించే అవకాశం ఉంది (కొత్త మైక్రా మరియు మైక్రా యాక్టివ్ మాదిరిగా). ఈ వేరియంట్‌ను సన్నీ యాక్టివ్ అని పిలవనున్నట్లు సమాచారం. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్‌ను గమనిస్తూ ఉండండి.


Click it and Unblock the Notifications








