బిఎమ్‌డబ్ల్యూ ఇన్ఫోటైన్‌మెంట్ ద్వారా గో ప్రోను కంట్రోల్ చేయవచ్చు
వీడియో చిత్రీకరణ విధానంలో విప్లవాత్మక మార్పులను తీసుకువచ్చిన గో ప్రో కెమెరా. ప్రపంచాన్ని ఓ వినూత్న కోణంలో చూపెట్టడంలో సఫలీకృతమైంది ఈ గో ప్రో కెమెరా. సాధారణంగా, గో ప్రో కెమెరాలు చిన్ని పరిమాణంలో ఉండి, తక్కువ బరువును కలిగి ఉండటమే కాకుండా, పెద్ద వీడియో కెమెరాలతో సమానంగా హై డెఫినెషన్ వీడియోలను చిత్రీకరించగలవు.
ఇప్పుడు ఇలాంటి గో ప్రో కెమెరాలను బిఎమ్‌డబ్ల్యూ కార్ యజమానులు తమ వాహనంలో ఉండే ఆన్-బోర్డ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ద్వారానే కంట్రోల్ చేయవచ్చని, ఇందుకోసం ఓ ప్రత్యేక అప్లికేషన్‌ను విడుదల చేశామని జర్మన్ కార్ కంపెనీ బిఎమ్‌డబ్ల్యూ పేర్కొంది.
ఈ కొత్త ఫీచర్ సాయంతో బిఎమ్‌డబ్ల్యూ ఓనర్లు కెమెరా రికార్డింగ్‌ను స్టార్ట్ లేదా స్టాప్ చేయటంతో పాటుగా ఆరు ముందుగా సెట్ చేసిన మోడ్స్‌ను కూడా ఎంచుకోవచ్చు. ఈ మోడ్స్‌లో లీజర్ డ్రైవ్ ఫేసింగ్ అవుట్, నైట్ డ్రైవింగ్, స్పోర్ట్ డ్రైవ్ ఫేసింగ్ అవుట్, డ్రైవ్ కెమెరా ఫేసింగ్ ఇన్, విండింగ్ రోడ్ టైమ్ ల్యాప్స్, స్ట్రైట్ రోడ్ టైమ్ ల్యాప్స్ ఉన్నాయి.

బిఎమ్‌డబ్ల్యూ యాప్స్‌తో కూడిన 2012 మోడల్ లేదా ఆ తర్వాతి సంవత్సరం మోడల్ బిఎమ్‌డబ్ల్యూ కార్లు కలిగిన ఓనర్లు లేదా మినీ కనెక్టెడ్ సిస్టమ్ కలిగిన కార్ ఓనర్లు ఈ కొత్త అప్లికేషన్‌ను జులై నెలలో యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కార్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ నుంచి కెమెరాను యాక్సెస్ చేయాలంటే, మీరు ఉపయోగించే గో ప్రో కెమెరా వైఫై సామర్థ్యాన్ని కలిగి ఉండాలి.
బిఎమ్‌డబ్ల్యూ రిలీజ్ చేయనున్న ఈ యాప్‌ను అన్ని ఐఫోన్లలో ఇన్‌స్టాల్ చేసుకొని, కారుతో కనెక్ట్ చేసుకోవచ్చు. గో ప్రో కెమెరా ఇన్ యాక్షన్ వీడియోని మీరు కూడా చూడండి..!
<center><iframe width="100%" height="450" src="//www.youtube.com/embed/Z3aolMKSMsE?rel=0" frameborder="0" allowfullscreen></iframe></center>


Click it and Unblock the Notifications








