మెర్సిడెస్ బెంజ్ కార్లలో యాపిల్ కార్ ప్లే ఇన్ఫోటైన్‌మెంట్

By Ravi

ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం యాపిల్ ఐఎన్‌సి, 'యాపిల్ కార్ ప్లే' (Apple CarPlay) అనే ఓ సరికొత్త ఇన్-కార్ ఇంటర్‌టైన్‌మెంట్ సిస్టమ్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసినదే. ఈ సిస్టమ్‌ను ఇప్పటికే వోల్వో, బిఎమ్‌‌డబ్ల్యూ, పయోనీర్ వంటి సంస్థలు తమ కార్లలో ఉపయోగించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

తాజాగా, జర్మన్ లగ్జరీ కార్ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ కూడా 2015లో విడుదల చేయబోయే దాదాపు అన్ని కార్లలో యాపిల్ కార్ ప్లే సిస్టమ్‌ను పరిచయం చేయనుంది. ఐప్యాడ్, ఐఫోన్ లేదా ఐపాడ్ వంటి అన్ని రకాల యాపిల్ గ్యాడెట్స్‌లోని ఫీచర్లను ఈ యాపిల్ కార్ ప్లే ద్వారా పొందవచ్చు. వాయిస్ అండ్ స్టీరింగ్ వీల్ కంట్రోల్స్ ద్వారా యాపిల్ ఫీచర్లను మరియు సర్వీసులను యాక్సెస్ చేసుకోవచ్చు.

కొత్తగా డిజైన్ చేసిన ఇన్-కార్ సాఫ్ట్‌వేర్ మరియు యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్‌లు కారు ఇంటీరియర్‌కు ఓ సరికొత్త లుక్ అండ్ ఫీల్‌ను ఇ్వవటమే కాకుండా, కస్టమర్ల ఇన్-కార్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఇవి పూర్తిగా మార్చేస్తాయి. యాపిల్ కార్ ప్లే సిస్టమ్‌లో ఫోన్, మెసేజెస్, మ్యూజిక్, వీడియోస్, నావిగేషన్ వంటి అనేక సేవలు అందుబాటులో ఉంటాయి.

Now Mercedes To Integrate Apple CarPlay In Its Cars In 2015

More from DriveSpark

Article Published On: Tuesday, November 18, 2014, 11:45 [IST]
English summary
German luxury carmaker Mercedes-Benz will soon have Apple’s CarPlay operating system in all its cars by early 2015.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+