ఎన్‌విడియా టెగ్రా ప్రాసెసర్‌తో హోండా ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం ఎన్‌విడియా, హోండా కార్లలో ఉపయోగించే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం ఓ పవర్‌ఫుల్ ప్రాసెసర్‌ను విడుదల చేసినట్లు పేర్కొంది. ప్రత్యేకించి హోండా కనెక్ట్ ఇన్-కార్ ఆడియో అండ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కోసం 'ఎన్‌విడియా టెగ్రా' అనే మొబైల్ ప్రాసెసర్‌ను విడుదల చేశామని, ఎన్‌విడియా టెగ్రాతో లభ్యం కానున్న ప్రపంచపు మొట్టమొదటి ఎంబడెడ్ ఆండ్రాయిడ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ తమదేనని కంపెనీ పేర్కొంది.
వచ్చే ఏడాది యూరప్ మార్కెట్లలో విడుదల కానున్న 2015 హోండా సివిక్, సివిక్ టూరర్, సిఆర్-వి వంటి మోడళ్లలో ఎన్‌విడియా టెగ్రా మొబైల్ ప్రాసెసర్‌తో కూడిన ఈ సరికొత్త హోండా కనెక్ట్ ఇన్-కార్ ఆడియో అండ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఉపయోగించనున్నారు.

టెగ్రా ఆటోమోటివ్ గ్రేడ్ ప్రాసెసర్‌ను ఇంటిగ్రేట్ చేయటం ద్వారా ఇన్-వెహికల్ ఇన్ఫోటైన్‌మెంట్ అప్లికేషన్లలో ఎన్‌విడియా టెక్నాలజీని ఉపయోగిస్తున్న 19వ గ్లోబల్ ఆటోమేకర్‌గా హోండా నిలువనుంది. 2014 ప్యారిస్ మోటార్ షోలో హోండా ఆవిష్కరించిన సరికొత్త ఉత్పత్తుల ద్వారా ఈ టెక్నాలజీని పరిచయం చేశారు.
హోండా నుంచి త్వరలో మార్కెట్లోకి రానున్న 2015 సివిక్, సివిక్ టూరర్, సిఆర్-వి మోడళ్లలో ఆండ్రాయిడ్ 4.0.4 ఎంబడెడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో కూడిన ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను పరిచయం చేసేందుకు గాను ఎన్‌విడియా మరియు హోండా కంపెనీలు సంయుక్తంగా కలిసి పనిచేశాయి. గేమింగ్, టాబ్లెట్, టివి ప్లాట్‌ఫామ్స్‌లో ఆండ్రాయిడ్‌తో పనిచేయటంలో ఎన్‌విడియా నైపుణ్యాన్నంతా ఉపయోగించి ఈ హోండా కనెక్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను తయారు చేసింది.

శక్తివంతంగా ఉండి, విద్యుత్‌ను తక్కువగా వినియోగించుకునే ఈ ఆటోమోటివ్ గ్రేడ్ ఎన్‌విడియా టెగ్రా ప్రాసెసర్‌తో కూడిన హోండా కనెక్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను ఉపయోగించడం చాలా సులువుగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. పించ్, జూమ్, స్వైప్ వంటి టచ్ స్క్రీన్ గెశ్చర్చ్ చాలా వేగంగా పనిచేస్తాయని, నేటి ఆధునిక స్మార్ట్‌ఫోన్లు, టాబ్లెట్లతో యూజర్లు ఎలాంటి అనుభూతిని పొందుతారో అదే అనుభూతిని తమ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ద్వారా పొందవచ్చని కంపెనీ తెలిపింది.

ఎన్‌విడియా టెగ్రా ప్రాసెసర్‌తో కూడిన హోండా కనెక్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌లో 7 ఇంచ్ కెపాసిటివ్ టచ్‌స్క్రీన్ ఉంటుంది. ఇది శాటిలైట్ నావిగేషన్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇంకా రియర్ వ్యూ కెమెరాకు డిస్‌ప్లే యూనిట్‌గా పనిచేయటమే కాకుండా వాహనానికి సంబంధించిన సమాచారాన్ని కూడా ఇది తెలియజేస్తుంది. అధిక ఫీచర్లు, ఆకర్షనీయమైన గ్రాఫిక్స్, కస్టమైజబల్ స్క్రీన్స్, హోండా యాప్ సెంటర్, ఆడియో సిస్టమ్ వంటి పలు విశిష్టమైన ఫీచర్లు ఈ హోండా కనెక్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సొంతం.


Click it and Unblock the Notifications








