పనికిరాని పాత టైర్లతో బ్యాటరీ పెర్ఫార్మెన్స్ బెటర్

By Ravi

మీ బైక్‌దో లేదా కారుదో టైరు అరిగిపోతే ఏం చేస్తారు..? ఆ ఏం చేస్తాం మహా అయితే పారేస్తాం లేదా భోగి మంటలో కాల్చేస్తాం అంటారా..! కానీ భారతీయ సంతతికి చెందిన శాస్త్రవేత్తలు మాత్రం పారేసిన పనికిరాని టైర్ల నుంచి బ్యాటరీల పెర్ఫార్మెన్స్‌ను మెరుగు పరచేందుకు గాను ఆనోడ్‌లను తయారు చేస్తామని చెబుతున్నారు.

ఇది కూడా చూడండి: పనికిరాని టైర్లతో అద్భుతమైన శిలాఖండాలు

యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీకి చెందిన ఓక్ రిడ్జ్ నేషనల్ లేబోరేటరీకి చెందిన పరిశోధకులు అరిగిపోయిన, పనికి రాని టైర్లలో ఉండే కార్బన్ బ్లాక్‌ను ఉపయోగించి, లిథియం అయాన్ బ్యాటరీ పెర్ఫార్మెన్స్‌ను మెరుగు పరచేందుకు కావల్సిన ఆనోడ్‌లను తయారు చేసే విధానాన్ని కనుగొన్నారు.

Old Car Tyres

పరాన్స్ పరంథామన్ మరియు అమిత్ నస్కర్‌ల ఆధ్వర్యంలోని పరిశోధకుల బృందం ఈ విధానాన్ని కనుగొంది. విద్యుత్ స్టోరేజ్ కోసం వేస్ట్ టైర్లను ఉపయోగించడం చాలా ఆకర్షనీయమైనదే కాకుండా, ఇలాంటి కర్భన వ్యర్థాలను భూమిపై పడవేయటం వలన పర్యావరణానికి కలిగే నష్టాన్ని కూడా కొంత మేర తగ్గించవచ్చని పరంథామన్ చెప్పుకొచ్చారు.

గ్రాఫైట్‌ను వెలికి తీసేందుకు అనుసరించే విధానం మాదిరిగానే ఈ పైరోలిటిక్ కార్బన్ బ్లాక్ మెటీరియల్‌ను వెలికితీసే విధానంగా కూడా ఉంటుందని, అయితే ఇక్కడ యంత్రాలకు బదులుగా మనుషులు ఈ విధానం చేస్తారని ఆయన వివరించారు. లిథియం బ్యాటరీలలో ఆనోడ్స్ ఉపయోగించడం వలన కమర్షియల్ గ్రాఫైట్ మెటీరియల్స్‌చో ఉపయోగించే లభించే విద్యుత్ సామర్థ్యం కన్నా మరిత ఎక్కువ సామర్థ్యాన్ని సాధించవచ్చని పరిశోధకులు తెలిపారు.

More from DriveSpark

Article Published On: Tuesday, September 2, 2014, 11:16 [IST]
English summary
Indian-origin scientists have found that carbon black, a substance recovered from discarded tires, can be used to make anodes for better-performing lithium-ion batteries.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+