కేవలం 15 బుగాటి వేరాన్ కార్లు మాత్రమే మిగిలున్నాయ్!

By Ravi

ప్రపంచంలో కెల్లా అత్యంత వేగంగా పరుగులు తీసే కారు 'బుగాటి వేరాన్' (Bugatti Veyron) అమ్మకాలు దాదాపుగా పూర్తి కావస్తున్నాయి. ఇక కేవలం 15 యూనిట్ల వేరాన్ కార్లు మాత్రం విక్రయానికి అందుబాటులో ఉన్నాయి. ఆ తర్వాత ఈ పాపులర్ బుగాటి వేరాన్ ఉత్పత్తి నిలిచిపోనుంది. 2005లో తొలిసారిగా మార్కెట్లను తాకిన ఈ కారు ఉత్పత్తి తుది దశకు చేరుకోనుంది.

బుగాటి వేరాన్ ఉత్పత్తిని కంపెనీ కేవల 450 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. కాగా.. ఇందులో ఇప్పటే కంపెనీ 405 బుగాటి వేరాన్ కార్లు కస్టమర్లకు డెలివరీ అయ్యాయి. మిగిలిన 45 వేరాన్ కార్లలో 30 కార్లకు ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఇక మిగిలిన కేవలం 15 బుగాటి వేరాన్ కార్లు మాత్రమే. ఆ 15 కార్లను సొంతం చేసుకునే లక్కీ కస్టమర్ల కోసం కంపెనీ ఎదురుచూస్తోంది.

Bugatti Veyron

సూపర్‌కార్ కంపెనీలు తమ మోడళ్లలో ఎక్స్‌క్లూజివిటీని మెయింటైన్ చేయటం కోసం ఉత్పత్తిని పరిమితం చేస్తుంటారు. అలాగే, బుగాటి కూడా తమ వేరాన్ ఉత్పత్తిని కేవలం 450 యూనిట్లకు మాత్రమే పరిమితం చేసింది. బుగాటి వేరాన్‌లో నాలుగు రకాల వేరియంట్లు ఉన్నాయి, అవి - 1101 పిఎస్ వేరాన్, 2005 మోడల్ 16.4, వేరాన్ 16.4 గ్రాండ్ స్పోర్ట్ మరియు 2008 మోడల్ ఒరిజినల్ వేరాన్ యొక్క రోడ్‌స్టర్ వెర్షన్.

వీటిలో ఫాస్టెస్ట్ ప్రొడక్షన్ కారు 1200 పిఎస్ వేరాన్ సూపర్ స్పోర్ట్. ఇది 2010 మోడల్. ఫాస్టెస్ట్ ఓపెన్‌టాప్ ప్రొడక్షన్ కారు విషయానికి వస్తే, అది వేరాన్ 16.4 గ్రాండ్ స్పోర్ట్ విటెస్స్. ఇది 2012 మోడల్. కూపే వెర్షన్ వేరాన్ల ఉత్పత్తిని 300 యూనిట్లకు పరిమితం చేశారు కాబట్టి ఈ వెర్షన్ మోడళ్లు అప్పుడే ఖాలీ అయిపోయాయి. ఇక మిగిలినవి 150 యూనిట్లు రోడ్‌స్టర్ వెర్షన్లు. వీటిలో ఇప్పటికే 100 యూనిట్లు అమ్ముడుపోయాయి. అంటే, ఇక చివరికి మిగిలినవి 50 యూనిట్ల వేరాన్ రోడ్‌స్టర్ వెర్షన్లు మాత్రమే.

More from DriveSpark

Article Published On: Monday, August 11, 2014, 11:27 [IST]
English summary
One of the greatest cars in automotive history is nearing its end. Production of Bugatti Veyron, the monster of a supercar, which was conceived in 2005, will come to an end in the near future as production inches towards its stipulated production limit. Now there are just 15 units left available to buy.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+